ETV Bharat / bharat

5 నెలల కనిష్ఠానికి కరోనా కేసులు- వ్యాక్సినేషన్​లో కొత్త రికార్డు - కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 25,166 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. గడిచిన 154 రోజుల్లో ఇవే అతితక్కువ. మరో 437 మంది మరణించారు. మరోవైపు వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొత్త రికార్డును సృష్టించింది దేశం. సోమవారం ఒక్కరోజే 88.13 లక్షల మందికిపైగా కొవిడ్ టీకా డోసులను పంపిణీ చేసింది.

COVID19
వైరస్
author img

By

Published : Aug 17, 2021, 9:59 AM IST

Updated : Aug 17, 2021, 3:29 PM IST

భారత్​లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్​ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 25,166 మంది వైరస్ బారినపడ్డారు. గడిచిన 154 రోజుల్లో ఇవే అతితక్కువ. మరో 437 మంది మరణించారు. కొత్తగా 36,830 మంది కరోనా​ను జయించారు. ప్రస్తుతం రికవరీ రేటు 97.51 శాతంగా ఉంది.

వ్యాక్సినేషన్..

దేశంలో సోమవారం 15,63,985 కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 88,13,919 వ్యాక్సిన్లు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు మొత్తంగా 55,47,30,609 టీకా డోసులు పంపిణీ చేశారు.

  • మొత్తం కేసులు : 3,22,50,679
  • యాక్టివ్​ కేసులు : 3,69,846
  • కోలుకున్నవారు: 3,14,48,754
  • మరణాలు : 4,32,079

రికార్డు స్థాయిలో రికవరీ రేటు..

జాతీయ రికవరీ రేటు ప్రస్తుతం 97.51 శాతంగా ఉంది. 2020, మార్చి నుంచి చూస్తే.. ఇదే అత్యధికం. రోజూవారీ పాజిటివిటీ రేటు 1.15శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 146 రోజుల కనిష్ఠ స్థాయికి వెళ్లాయి.

వ్యాక్సినేషన్​లో రికార్డు..

సోమవారం ఒక్కరోజే 88.13 లక్షల మందికిపైగా కొవిడ్ టీకా డోసులను పంపిణీ చేసింది కేంద్రం. ఒక్కరోజులో అత్యధిక వ్యాక్సిన్ డోసులు అందించటం ఇదే తొలిసారి.

ప్రపంచంలో కొవిడ్​ కేసులు..

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 5,24,080 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 7,642 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 20,87,05,201కి చేరగా.. మరణాల సంఖ్య 43,83,786కు పెరిగింది.

కొత్త కేసులు..

  • అమెరికా- 1,03,697
  • బ్రెజిల్-​ 14,887
  • ఫ్రాన్స్-​ 5,829
  • బ్రిటన్​- 28,438
  • రష్యా- 20,765

ఇదీ చదవండి: కరోనా మూడో దశ హెచ్చరికలు.. వాటి ఎగుమతిపై ఆంక్షలు

Last Updated : Aug 17, 2021, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.