దేశంలో కొవిడ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వరుసగా నాలుగోరోజూ 2 లక్షల దిగువన కరోనా కేసులు(coronavirus india) నమోదయ్యాయి. కొత్తగా 1,52,734 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 3,128 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2,38,022 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 91.60 శాతంగా ఉంది.
- మొత్తం కేసులు: 2,80,47,534
- మొత్తం మరణాలు: 3,29,100
- కోలుకున్నవారు: 2,56,92,342
- యాక్టివ్ కేసులు: 20,26,092
ఇదీ చదవండి: 'టీకాతో ఏడాది పాటు రక్షణ'
34.48 కోట్ల పరీక్షలు..
దేశంలో ఇప్పటి వరకు 34,48,66,883 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. ఆదివారం ఒక్కరోజే 16,83,135 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు తెలిపింది.
ఇదీ చదవండి: Covid vaccine: బూస్టర్ డోసు అవసరమా?
వ్యాక్సినేషన్..
ఒక్కరోజే 10,18,076 వ్యాక్సిన్ డోసులు(corona vaccination) అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 21,31,54,129కి చేరినట్లు చెప్పింది.
ఇదీ చదవండి: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలివే..