దేశంలో మరో 12,689 కరోనా కేసులు - భారత్లో జనవరి 27న కొత్త కరోనా కేసులు
దేశంలో మరో 12,689 మందికి కరోనా సోకింది. కొవిడ్ బారినపడిన వారిలో మరో 137 మంది మృతిచెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20 లక్షల 29 వేల మందికిపైగా వ్యాక్సిన్ తీసుకున్నారు.
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 12,689 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో 137 మంది ప్రాణాలు కోల్పోయారు. 13,320 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
మొత్తం కేసులు:1,06,89,527
యాక్టివ్ కేసులు: 1,76,498
కోలుకున్నవారు: 1,03,59,305
మరణాలు: 1,53,724
దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజులో 5,50,426 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. మొత్తం 19,36,13,120 పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 20,29,480కు చేరింది.
ఇదీ చదవండి:ఆవిష్కరణ ఎక్కడైనా తయారీ భారత్లోనే