దేశంలో కొవిడ్ ఉద్ధృతి(Covid-19 cases) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 1,32,364మంది వైరస్ బారినపడ్డారు. మహమ్మారి ధాటికి మరో 2,713మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2,07,071 మంది వైరస్ (covid-19 India) నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 2,85,74,350
- మొత్తం మరణాలు: 3,40,702
- కోలుకున్నవారు:2,65,97,655
- యాక్టివ్ కేసులు: 16,35,993
ఇదీ చదవండి:Covid: మహారాష్ట్రలో దశలవారీగా 'అన్లాక్'
35 కోట్ల 74 లక్షల టెస్టులు..
గురువారం ఒక్కరోజే 20,75,428 నమూనాలను(covid-19 testing ) పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 35,74,33,84 చేరిందని పేర్కొంది.
ఇదీ చదవండి:కరోనా రోగులతో డాక్టర్ల డ్యాన్స్.. వీడియో వైరల్
వ్యాక్సినేషన్..దేశంలో మొత్తంగా 22,41,09,448 వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చదవండి:Delta variant: అక్కడ పరిస్థితులు ఆందోళనకరం!