దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. కొత్తగా 96,982 మందికి వైరస్ సోకినట్టు తేలింది. మరో 446 మంది మహమ్మారికి బలయ్యారు.
- మొత్తం కేసులు: 1,26,86,049
- మొత్తం మరణాలు: 1,65,547
- కోలుకున్నవారు: 1,17,32,279
- యాక్టివ్ కేసులు: 7,88,223
వైరస్ సోకిన వారిలో సోమవారం 50,143 మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 92.48 శాతానికి తగ్గగా.. మరణాల రేటు 1.30 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 12లక్షల 11వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్‌ల సంఖ్య 25కోట్ల 2లక్షలు దాటింది.
తాజాగా.. 43 లక్షల మందికిపైగా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు టీకా పొందిన లబ్ధిదారుల సంఖ్య 8.31 కోట్లకు చేరింది.
ఇదీ చదవండి:ఒకే పాఠశాలలో 99 మంది విద్యార్థులకు కరోనా!