భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దు(Ind Pak Border), నియంత్రణ రేఖ వెంబడి 2010-21 మధ్య 14,411 సార్లు కాల్పులు (Ceasefire India Pakistan) జరిగినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. 2010 నుంచి ఫిబ్రవరి 2021 వరకు 14,411 సార్లు కాల్పులు జరగగా.. మొత్తం 267 మంది మృతిచెందారని పేర్కొంది.
సమాచార హక్కు చట్టం ప్రకారం పుణెకు చెందిన సామాజిక కార్యకర్త ప్రఫుల్ సార్దా దాఖలు చేసిన అభ్యర్థనకు.. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని (ఎస్- జేకే), సీపీఐఓ విభాగం డైరెక్టర్ సులేఖ ఈ వివరాలు తెలిపారు. 2010- 2021 ఫిబ్రవరి మధ్య కాలానికి చెందిన గణాంకాలను వెల్లడించారు.
మొత్తం కాల్పులు... 14,411
- (2010- 2014)... 1,178
- (2015- 2021 ఫిబ్రవరి)... 13,235
కాల్పుల్లో మృతిచెందిన సైనికులు.. 138
- (2010- 2014)... 20
- (2015- 2021 ఫిబ్రవరి)... 118
గాయపడ్డ సైనికులు... 664
- (2010-2014)... 97
- (2015-2021 ఫిబ్రవరి)... 567
కాల్పుల్లో మరణించిన సామాన్య ప్రజలు ... 129
- (2010-2014)...18
- (2015-2021 ఫిబ్రవరి)...111
కాల్పుల్లో గాయపడ్డ సామాన్య ప్రజలు.. 807
- (2010-2014)... 132
- (2015-2021 ఫిబ్రవరి)... 576
2015 నుంచి ఏటా క్రమంగా సరిహద్దు వద్ద కాల్పులు పెరిగాయి. 2020 లాక్డౌన్ ఏడాదిలోనూ 5,133 కాల్పులు జరిగాయి. 2021 జనవరి, ఫిబ్రవరిలోనే.. 658 సార్లు కాల్పులు జరిగాయి.
ఆర్టీఐ అందించిన వివరాలు ఆందోళనకరంగా ఉన్నాయని సామాజిక కార్యకర్త ప్రఫుల్ సార్దా తెలిపారు. ఎన్డీఏ పాలనలోనే అత్యధికంగా కాల్పులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీఏ పాలనలో సరిహద్దు ప్రాంతాల్లో అటు సైనికులకు, సామాన్య ప్రజలకు సురక్షితం కాదన్న వాస్తవం.. ఈ లెక్కలు చెబుతున్నాయన్నారు.
ఇదీ చదవండి: ఉగ్ర చొరబాటు భగ్నం- ఇద్దరు ముష్కరులు హతం