ETV Bharat / bharat

వ్యాక్సినేషన్​లో అమెరికాను దాటిన భారత్ - భారత్​ అమెరికా టీకా పంపిణీ

టీకా పంపిణీలో భారత్​ అమెరికాను దాటిందని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 32,36,63,297 డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.

vaccination in america, india overtakes usa in vaccination
అగ్రరాజ్యాన్ని దాటిన భారత్​ వ్యాక్సినేషన్​
author img

By

Published : Jun 28, 2021, 11:11 AM IST

వ్యాక్సిన్​ పంపిణీ ప్రక్రియలో భారత్​ అమెరికాను అధిగమించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఈ ఏడాది జనవరి నుంచి టీకా పంపిణీ చేపట్టగా.. ఇప్పటివరకు 32,36,63,297 డోసులను పంపిణీ చేసినట్లు పేర్కొంది.

గతేడాది డిసెంబరులో వ్యాక్సినేషన్​ ప్రారంభించిన అమెరికా.. ఇప్పటివరకు 32,33,27,328 డోసులను మాత్రమే పంపిణీ చేసింది.

భారత్​లో ఈ ఏడాది జనవరి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా విడతల వారీగా కేంద్రం పంపిణీ చేపడుతోంది. వ్యాక్సినేషన్​ ప్రక్రియను విస్తృతం చేసేందుకు కేంద్రం ఇటీవల కొత్త టీకా విధానాన్ని ప్రవేశపెట్టింది. తొలి విడతలో ఫ్రంట్​లైన్​ వర్కర్లకు టీకా పంపిణీ చేపట్టగా.. రెండో విడతలో 60ఏళ్లు పైబడిన వారు, 45ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ల పంపిణీ ప్రారంభించింది. మూడో విడతలో 18ఏళ్లు పైబడిన వారికి కూడా టీకా అందిస్తోంది.

ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ టీకాలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే విదేశీ టీకాలు కూడా అందుబాటులోకి వస్తాయని కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది.

ఇదీ చదవండి : 'కాకులు, కొంగలు తింటాం.. మాకు టీకా వద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.