ETV Bharat / bharat

India Name Change In Text Books : 'ఇకపై టెక్స్ట్ బుక్స్​లో 'ఇండియా' బదులు భారత్​!' - జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి టెక్స్ట్ బుక్స్

India Name Change In Text Books : దేశంలోని అన్ని పాఠ్యపుస్తకాల్లో ఇండియా అనే పదాన్ని భారత్​గా మార్చాలని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి-NCERT సిఫార్సు చేసింది. వివిధ పోరాటాల్లో హిందూ విజయాలను పాఠ్యపుస్తకాల్లో హైలైట్ చేయాలని కూడా కమిటీ సూచించింది. ఈ ప్రతిపాదనలపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి.

India Name Change In Text Books
India Name Change In Text Books
author img

By PTI

Published : Oct 25, 2023, 2:23 PM IST

Updated : Oct 25, 2023, 5:42 PM IST

India Name Change In Text Books : దేశంలోని అన్ని పాఠ్యపుస్తకాల్లో ఇండియా అనే పదాన్ని భారత్​గా మార్చాలని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి-NCERT ప్రత్యేక కమిటీ సిఫార్సు చేసింది. ఈ విషయాన్ని ఎన్‌సీఈఆర్‌టీ కమిటీ ఛైర్మన్​ ఐజాక్ బుధవారం​ వెల్లడించారు. పాఠ్య పుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులుగా పురాతన చరిత్రను ప్రవేశపెట్టాలని కూడా ఎన్‌సీఈఆర్‌టీ ప్యానెల్ సిఫార్సు చేసినట్లు ఐజాక్​ తెలిపారు.

జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలు, ప్రణాళికలను ఖరారు చేసేందుకు ఇటీవలే ఎన్‌సీఈఆర్‌టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ.. ఈ సిఫార్సులు చేసినట్లు ఛైర్మన్​ ఐజాక్​ తెలిపారు. ప్యానెల్ చేసిన ప్రతిపాదనను కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చెప్పారు. వివిధ పోరాటాల్లో హిందూ విజయాలను పాఠ్యపుస్తకాల్లో హైలైట్ చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసిందని ఆయన చెప్పారు. అన్ని సబ్జెక్ట్​ల పాఠ్య పుస్తకాల్లో ఇండియన్​ నాలెడ్జ్​ సిస్టమ్​ను ప్రవేశపెట్టాలని కూడా సూచించినట్లు వెల్లడించారు. అయితే ప్యానెల్ సిఫార్సులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్‌సీఈఆర్‌టీ ఛైర్మన్​ దినేశ్​ సక్లానీ ప్రకటించారు.

ఎన్​సీఈఆర్​టీ క్లారిటీ..
మరోవైపు, ప్యానెల్​ చేసిన సిఫార్సులపై ఎన్​సీఈఆర్​టీ క్లారిటీ ఇచ్చింది. జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలు, ప్రణాళికల ఖరారు ప్రక్రియ జరుగుతోందని చెప్పింది. ప్యానెల్​ సిఫార్సులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పరోక్షంగా వెల్లడించింది. ఈ దశలో కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలపై స్పందించడం సరికాదని చెప్పింది.

  • On media reports about changing the name of India to Bharat in all NCERT textbooks, NCERT says that since the development of new syllabus and textbooks is in the process and for that purpose various Curricular Area Groups of domain experts are being notified by the NCERT. So, it… https://t.co/63muredLP7 pic.twitter.com/FiZvyZFfRE

    — ANI (@ANI) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాజకీయ దుమారం..
అయితే పాఠ్యపుస్తకాల్లో ఇండియా పదాన్ని భారత్​గా మార్చాలన్న ఎన్​సీఈఆర్​టీ కమిటీ సిఫార్సులతో దేశంలో రాజకీయ దుమారం రేగింది. ఎన్​సీఆర్​టీ కమిటీ సిఫార్సులపై కాంగ్రెస్​ జనరల్​ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​ మండిపడ్డారు. "పాఠ్యపుస్తకాలు, సిలబస్.. అలా ప్రతి అంశం​ ద్వారా భారతదేశ చరిత్రను ఎలా వక్రీకరిస్తున్నారో చూడండి. మాకు ఇండియా, భారత్​ రెండూ సమానమే" అని తెలిపారు.

  • #WATCH | Delhi: On NCERT panel recommendation of replacing 'India' with 'Bharat' in school textbooks, Congress General Secretary KC Venugopal says, "They are suggesting so many things. You can see how they are distorting the history of India through the textbook, syllabus, and… pic.twitter.com/7Kx3NAU9ju

'మోదీకి భయం పట్టుకుంది'
విపక్ష కూటమి 'ఇండియా' ఏర్పాటుతో ప్రధాని నరేంద్ర మోదీకి భయం పట్టుకుందని ఆప్​ నేత ప్రియాంక కక్కర్​ విమర్శించారు. పేర్ల మార్పు బదులు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతితో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. తమకు ఇండియా, భారత్​ రెండూ ఒకటేనని చెప్పారు. రాజ్యాంగంలో ఆ రెండు పదాలు ఉపయోగించినట్లు తెలిపారు. మరోవైపు, ఎన్​సీఈఆర్​టీ సిఫార్సులను తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్​ తిరుపతి స్వాగతించారు. ఇండియా అంటే భారత్​ అని రాజ్యాంగంలో ఉన్నట్లు తెలిపారు.

  • #WATCH | Delhi: AAP Spokesperson Priyanka Kakkar on NCERT panel recommendation of replacing 'India' with 'Bharat' in school textbooks says, "We don't have an issue with either Bharat or India, I'm telling you that PM Modi has an issue with India and that happened only after the… pic.twitter.com/y4ibdTwzXo

'గాంధీ హత్య', 'RSS బ్యాన్​' పాఠాలు తొలగింపు.. భగ్గుమన్న కాంగ్రెస్​

టెన్త్​ క్లాస్​ బుక్​లో 'పిరియాడిక్ టేబుల్​', 'ప్రజాస్వామ్యం' పాఠాలు మాయం.. NCERT కీలక నిర్ణయం

Last Updated : Oct 25, 2023, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.