ETV Bharat / bharat

ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిందా?.. అప్డేట్ చేసుకోవాలని కేంద్రం సూచన - దేశంలో ఆధార్ కార్డు వినియోగదారులు

Aadhar Card Update : ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటినవారు అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ గెజిట్​ను విడుదల చేసింది. అయితే.. ఇది తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.

aadhar update
ఆధార్ అప్డేట్
author img

By

Published : Nov 10, 2022, 6:08 PM IST

Updated : Nov 11, 2022, 3:35 PM IST

Aadhar Card Update : కేంద్రం ప్రభుత్వం.. ఆధార్ నిబంధనలను సవరించింది. ఆధార్ పొందిన 10 సంవత్సరాలు తర్వాత కనీసం ఒక్కసారైనా అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది. ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు అయినవాళ్లు గుర్తింపు పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించి అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే.. ఇది తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. గతేడాది 16 కోట్ల మంది ఆధార్​ కార్డులను అప్డేట్ చేసుకున్నారు. దేశంలో ఆధార్ కలిగి ఉన్నవారు 134 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది ఇంకా అప్డేట్ చేసుకోవాల్సి ఉందన్న విషయంపై స్పష్టత లేదు.

"పదేళ్ల క్రితం ఆధార్​ తీసుకుని, అప్పటి నుంచి తమ వివరాలను అప్డేట్ చేయని వారు.. డాక్యుమెంట్లను మళ్లీ సమర్పించాలని కోరుతున్నాం. గుర్తింపు పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలను నిర్దేశిత రుసుము చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు. 'మై ఆధార్​' పోర్టల్​ లేదా దగ్గర్లోని ఆధార్ కేంద్రం నుంచి ఈ పని పూర్తి చేయవచ్చు."
-కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ

దేశంలోని పౌరులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తూ ఆధార్​ కార్డులు జారీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఐరిస్​, వేలిముద్రలు, ఫొటోలను ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటుంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక సహా వేర్వేరు అవసరాలను ఆధార్​ను ఉపయోగిస్తోంది కేంద్రం.

ఇవీ చదవండి: 'మతం మారిన దళితులకు ఎస్సీ హోదా'... కేంద్రం ఏం చెప్పిందంటే?

ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ.. పెళ్లికి ఒప్పుకోలేదని పోలీస్ స్టేషన్​లోనే కత్తితో మెడపై..

Last Updated : Nov 11, 2022, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.