ETV Bharat / bharat

ప్రజాస్వామ్య సూచీలో 53కు పడిపోయిన భారత్‌

author img

By

Published : Feb 4, 2021, 6:15 AM IST

ప్రపంచ ప్రజాస్వామ్య సూచీ ర్యాంకింగ్స్​లో భారత్​ 53వ స్థానంలో ఉంది. 2019లో 6.9 స్కోరు సాధించగా.. 2020లో 6.61కి పడిపోయింది. ప్రస్తుత పాలనలో ప్రజాస్వామ్యంపై గౌరవం తగ్గడమే దీనికి కారణమని.. ది ఎకనామిస్ట్​ ఇంటెలిజెన్స్​ యూనిట్​ పేర్కొంది.

ప్రజాస్వామ్య సూచీకి సంబంధించి 2020 ప్రపంచ ర్యాంకుల్లో భారత్‌ 53కు పడిపోయింది. అధికారుల్లో ప్రజాస్వామ్యంపై గౌరవం తగ్గడం, పౌర స్వేచ్ఛను అణచివేయడం వంటి కారణాల వల్ల దేశ ర్యాంకింగ్‌ పడిపోయిందని ది ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ పేర్కొంది. అయితే.. పొరుగు దేశాలతో పోల్చితే మాత్రం భారత్‌ మెరుగైన స్థానంలో ఉండడం విశేషం.

2019లో భారత్‌ మొత్తంగా 6.9 స్కోర్‌ సాధించగా ఇప్పుడు అది 6.61కి పడిపోయింది. మొత్తం 167 దేశాలకు సంబంధించి ది ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ప్రజాస్వామ్య సూచీలకు సంబంధించి ర్యాంకులు ఇస్తుంది.

''భారత్‌లో ప్రజాస్వామ్య నిబంధనలు ఎదుర్కొంటున్న ఒత్తిడి కారణంగా.. ఆ దేశం 2020లో 6.61 స్కోర్‌ సాధించి 53వ ర్యాంకుకు పడిపోయింది. 2014లో 7.92 స్కోర్‌తో భారత్‌ 27వ స్థానంలో నిలిచింది. ప్రస్తుత పాలనలో ప్రజాస్వామ్యంపై గౌరవం తగ్గడడం వల్లే ర్యాంకుల్లో భారత్‌ దిగజారింది.''

- ది ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.