ETV Bharat / bharat

దేశంలో 3 కోట్ల మైలురాయి దాటిన టీకా పంపిణీ

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సరికొత్త తీరాలకు చేరింది. సోమవారం నాటికి 3.17 కోట్లకు పైగా టీకా డోసులను అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు.. ప్రజలు నిబంధనలు పాటించకపోవటమే కేసుల పెరుగుదలకు కారణమన్నారు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​.

India crosses the milestone of 3.15 crore #COVID19  vaccinations: Ministry of Health
దేశవ్యాప్తంగా 3 కోట్ల కొవిడ్ టీకాలు
author img

By

Published : Mar 15, 2021, 7:59 PM IST

Updated : Mar 15, 2021, 11:06 PM IST

కరోనా మహమ్మారి పోరులో భాగంగా టీకా పంపిణీలో భారత్​ సరికొత్త మైలురాయిని చేరుకుంది. సోమవారం నాటికి మొత్తం 3,17,71,661 వ్యాక్సిన్ డోసులను వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

అందులో 74,08,521 మంది తొలి డోసు, 43,97,613 రెండో డోసు తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు(హెచ్​ఎస్​డబ్ల్యూ) ఉన్నారు. వారితో పాటు 74,26,479 మంది తొలి డోసు, 13,23,527 రెండో డోసు వేయించుకున్న ఫ్రంట్​లైన్ వర్కర్స్​(ఎఫ్​ఎల్​డబ్ల్యూ) ఉన్నారు. వారు కాక 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాల వ్యాధులు ఉన్న 16,96,497 మంది, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు 95,19,024 మంది టీకా తీసుకున్నవారిలో ఉన్నారు.

సోమవారం ఒక్కరోజు రాత్రి 7 గంటల వరకు 18,63,623 టీకా డోసులు అందించారు.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ జనవరి 16న ప్రారంభమైంది. తొలుత వైద్య సిబ్బందికి టీకా అందించారు. మార్చి 1 నుంచి.. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.

అందుకే పెరుగుతున్నాయి..

  • पत्रकारों से बात करते हुए मैंने कहा कि लोगों की लापरवाही के कारण कुछ राज्यों में कोरोना के cases बढ़े हैं। मैंने कहा कि सभी राज्य सरकारों व देश के लोगों को सुनिश्चित करना होगा कि वैक्सीन आने के बाद भी COVID APPROPRIATE BEHAVIOUR में कोताही न बरती जाए।@ombirlakota @PMOIndia pic.twitter.com/I2Ggt2AsbM

    — Dr Harsh Vardhan (@drharshvardhan) March 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కొవిడ్ ఆంక్షల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కేసుల పెరుగుదలకు కారణమని హర్షవర్ధన్ పేర్కొన్నారు. కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే 80 శాతానికి పైగా వైరస్ కేసులు నమోదైనట్లు చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ మాస్క్​లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని పార్లమెంట్​ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.

ఇదీ చూడండి: మాస్కు ధరించలేదని మహిళపై అరెస్టు వారెంట్

Last Updated : Mar 15, 2021, 11:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.