Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 13,086 మంది వైరస్ బారినపడగా.. మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య సోమవారంతో పోలిస్తే 3వేల వరకు తగ్గింది. కొవిడ్ నుంచి 12,456 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.53 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.26 శాతం వద్ద స్థిరంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.90శాతానికి పడిపోయింది.
- మొత్తం కేసులు: 4,35,31,650
- మొత్తం మరణాలు: 5,25,242
- యాక్టివ్ కేసులు: 1,14,475
- కోలుకున్నవారి సంఖ్య: 4,28,91,933
Vaccination India: భారత్లో సోమవారం 11,44,805 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,09,87,178కు చేరింది. మరో 4,51,312 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,76,637 మంది వైరస్ బారినపడ్డారు. మరో 804 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 55,51,67,797కు చేరింది. మరణాల సంఖ్య 63,62,347 చేరింది. ఒక్కరోజే 6,59,745 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 52,98,96,665కు చేరింది.
- జర్మనీలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఒక్కరోజే 147,489 కేసులు నమోదయ్యాయి. 102 మంది కొవిడ్ తీవ్రతకు బలయ్యారు.
- ఇటలీలో ఒక్కరోజే 36వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 59 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో 33,833 మంది కొవిడ్ బారినపడగా.. 84 మంది మరణించారు.
- తైవాన్లో 32,681 కేసులు బయటపడగా.. 88 మంది తుది శ్వాస విడిచారు.
- ఆస్ట్రేలియాలో కొత్తగా 29,661 మందికి వైరస్ సోకగా.. 26 మంది మరణించారు.
ఇదీ చదవండి: