India Covid Cases: భారత్‌లో కొవిడ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 8,582 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి వల్ల నలుగురు ప్రాణాలు విడిచారు. శనివారం 4,143 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.69 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.1 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.71 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.02 శాతంగా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 43,214,777
- మొత్తం మరణాలు: 5,24,761
- యాక్టివ్ కేసులు: 44,513
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,52,743
Vaccination India: భారత్‌లో శనివారం 13,04,427 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,95,07,08,541 చేరింది. మరో 3,16,179 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు ఒక్కరోజే 382,377 కేసులు వెలుగుచూశాయి. మరో 929 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 540,136,732కు చేరింది. మరణాల సంఖ్య 6,330,785కు చేరింది. ఒక్కరోజే 392,212 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 514,062,612గా ఉంది.
- తైవాన్‌లో 79,663 కొవిడ్ కేసులు, 211 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో 44,642 మంది కరోనా బారిన పడ్డారు. మహమ్మారితో 65 మంది ప్రాణాలు కోల్పయారు.
- ఉత్తర కొరియాలో 42,810 కేసులు నమోదయ్యాయి.
- అమెరికాలో 39,743 కొత్త కేసులు, 74 మరణాలు వెలుగుచూశాయి.
- బ్రెజిల్లో 32,332 మంది వైరస్ బారిన పడ్డారు. 127 మంది చనిపోయారు.
ఇవీ చదవండి: నీటి గుంతలో పడిన స్కార్పియో.. 8 మంది దుర్మరణం