India Covid Cases: భారత్‌లో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 8,084 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం 4,592 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.68 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.10 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 4,32,22,861
- మొత్తం మరణాలు: 5,24,771
- యాక్టివ్ కేసులు: 47,995
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,57,335
Vaccination India: భారత్‌లో ఆదివారం 11,77,146 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,95,19,81,150కు చేరింది. మరో 2,49,418 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు ఒక్కరోజే 323,394కేసులు వెలుగుచూశాయి. మరో 540 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 540,487,950కు చేరింది. మరణాల సంఖ్య 6,331,430కు చేరింది. ఒక్కరోజే 380,775 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 515,672,844గా ఉంది.
- ఫ్రాన్స్‌లో 148,749 కొవిడ్ కేసులు వెలుగుచూాశాయి
- తైవాన్‌లో 50,657 కొవిడ్ కేసులు, 163 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఉత్తర కొరియాలో 40,070 కేసులు నమోదయ్యాయి.
- ఆస్ట్రేలియాలో 20,865 కొత్త కేసులు, 23 మరణాలు వెలుగుచూశాయి.
- ఇటలోలో 18,768 మంది వైరస్ బారిన పడ్డారు. 26 మంది చనిపోయారు.
ఇవీ చదవండి: నీటి గుంతలో పడిన స్కార్పియో.. 8 మంది దుర్మరణం