ETV Bharat / bharat

'బిమ్​స్టెక్​ బలోపేతానికి భారత్​ సిద్ధం' - ఎస్. జైశంకర్

బిమ్​స్టెక్​ ఆధ్వర్యంలో ప్రాంతీయ సహకారం బలోపేతం చేసేందుకు భారత్​ కట్టుబడి ఉందన్నారు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్. ఈ కూటమిని మరింత క్రియాశీలంగా మార్చేందుకు సహకరిస్తామని చెప్పారు.

India committed to cooperation under BIMSTEC framework: Jaishankar
'బిమ్​స్టెక్​ బలోపేతానికి భారత్​ కట్టుబడి ఉంది'
author img

By

Published : Apr 1, 2021, 8:45 PM IST

బిమ్​స్టెక్​ కూటమి ఆధ్వర్యంలో.. ప్రాంతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్​ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. బిమ్​స్టెక్​ను మరింత చురుకుగా, వేగంగా ఫలితాలు రాబట్టేలా తీర్చిదిద్దేందుకు సహకరిస్తామని చెప్పారు. ఈ మేరకు గురువారం వర్చవల్​గా జరిగిన ప్రాంతీయ కూటమి సమావేశంలో మాట్లాడారు.

అంతర్జాతీయ ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోరాటంలో సహకారం కోసం చేసుకున్న బిమ్​స్టెక్​ ఒప్పందం గత నెలలోనే అమల్లోకి వచ్చిందని జైశంకర్ గుర్తు చేశారు. రవాణా అనుసంధానం కోసం రూపొందించే మాస్టర్​ ప్లాన్​ను ఐదో బిమ్​స్టెక్​ సదస్సులో ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశం శ్రీలంకలో జరిగే అవకాశం ఉందన్నారు.

ఇదీ చూడండి: 'దీదీ.. ఇంకో స్థానం నుంచి పోటీ చేస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.