ETV Bharat / bharat

మధ్యాహ్న భోజనం తిని అస్వస్థత.. తాంత్రికుడితో చికిత్స.. స్కూల్​లో దెయ్యం ఉందని.. - మహోబాలో విద్యార్థినులకు తాంత్రికుడి ట్రీట్​మెంట్

మూఢనమ్మకాలను నమ్మవద్దని ప్రచారం చేయాల్సినవారే.. వాటిని పిల్లలకు నూరిపోస్తున్నారు. ఈ కాలంలోనూ దెయ్యాలు, భూతాలు, ఆత్మలు ఉన్నాయంటూ చెబుతూ వారిని మరింత భయానికి గురిచేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి ఘటనే ఉత్తర్​ప్రదేశ్​ మహోబా జిల్లాలోని కన్య ప్రాథమిక పాఠశాలలో జరిగింది.

15 UP Girl Students Ate Mid Day Meals
Girl Students Felt Ill
author img

By

Published : Dec 21, 2022, 6:41 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని మహోబా జిల్లాలో ఓ పాఠశాల యాజమాన్యం చేసిన పనిని అందరూ తప్పుబడుతున్నారు. స్కూల్లో చదివే విద్యార్థినులు మధ్యాహ్న భోజనం తినడం వల్ల కొంత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాలికలు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యాక వారిని ఆత్మలు ఆవహించాయని మాంత్రికుడిని పిలిపించింది స్కూల్​ యాజమాన్యం.

ఇదీ జరిగింది..
సోమవారం మధ్యాహ్నం విద్యార్థినులు పాఠశాలలో భోజనం తిన్నారు. తిన్న కాసేపటికే 15 మంది బాలికల ఆరోగ్యం క్షీణించింది. అస్వస్థకు గురైన విద్యార్థినులను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయిన బాలికల వయసు తొమ్మిది నుంచి 13 సంవత్సరాల మధ్య ఉంటుందని పాఠశాల వర్గాలు వెల్లడించాయి. సోమవారం జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని జిల్లా సబ్​ డివిజనల్​ కలెక్టర్​ అరుణ్​ దీక్షిత్​ చెప్పారు. ఇందుకు సంబంధించి వాస్తవాలను తెలుసుకుంటామని అన్నారు. మధ్యాహ్న భోజనం నమూనాలను పరీక్షల నిమిత్తం పంపినట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా.. పిల్లల ఆరోగ్యం పాడవటానికి పాఠశాల​లో ఉన్న దెయ్యమే కారణమని గ్రామస్థులు చెబుతున్నారు. పాఠశాలలో ఓ మహిళ తెల్ల చీర కట్టుకొని తిరగడం చూశానని.. ఆమే దెయ్యం అని అనుకుంటున్నామని ఓ విద్యార్థిని తెలిపింది. దీంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురై స్పృహతప్పి పడిపోయారని స్థానికులు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఎవరినీ అరెస్టు చేయలేదని పన్వాడి పోలీస్​ స్టేషన్​ ఇంఛార్జ్ జయ్​ప్రకాశ్​ ఉపాధ్యాయ్​ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.