ETV Bharat / bharat

సౌండ్​ చేశారో.. హారన్లు రోడ్డురోలర్​​ కిందకే! - ఠాణె ట్రాఫిక్​ పోలీస్​

బైకులకు పెద్దగా శబ్దం వచ్చేలా హారన్లు, సైలెన్సర్లను ఏర్పాటు చేసుకుని రయ్​ రయ్​ మంటూ దూసుకుపోవలనిపిస్తోందా? అలాంటి సాహసం చేయాలనుకుంటే ఇబ్బందులపాలైనట్లే. ఎవరైనా అలాంటి హారన్లు, సైలెన్సర్లు వాడితో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. వాటిని గుర్తించి రోడ్డు రోలర్​తో తొక్కించి ధ్వంసం చేస్తున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది.

thane police
హారన్లు
author img

By

Published : Jul 10, 2021, 11:54 AM IST

Updated : Jul 10, 2021, 12:14 PM IST

ఠాణె పోలీసుల చర్యలు

కొందరు రోడ్ల మీద వెళుతున్నప్పుడు హారన్లు విపరీతంగా కొడతారు. బైక్​, కార్లతో వచ్చే హారన్లను తీసేసి, వాటికన్నా పెద్ద శబ్దం చేసే వాటిని పెట్టుకుంటారు. సైలెన్సర్లు కూడా పెద్ద పెద్ద శబ్దాలు చేయడం మనం వినే ఉంటాం. వీటవల్ల చట్టుపక్కన భవనాల్లో నివసించే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని మహారాష్ట్ర ఠాణె పోలీసులు సీరియస్​గా తీసుకున్నారు. రోడ్డు రోలర్​తో తొక్కించి ఆ హారన్లు, సైలన్సర్లను ధ్వంసం చేశారు.

ప్రజల ఫిర్యాదుతో..

ఠాణెలో ట్రాఫిక్​ ఎక్కువే ఉంటుంది. ఈ కారణంగా అడ్డూఅదుపు లేకుండా హారన్ల మోత మోగిస్తూనే ఉంటారు వాహనదారులు. తమకు ఇబ్బందిగా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రజలు. దీంతో జూన్​15న రంగంలోకి దిగారు ఠాణె ట్రాఫిక్​ పోలీసులు. అప్పటి నుంచి పట్టుకున్న 1000కిపైగా సైలెన్సర్లు, 400 హారన్లను ఓ రోడ్డుపై పెట్టి, రోడ్డు రోలర్​​ చేత వాటిని ధ్వంసం చేశారు.

ఈ క్రమంలో ద్విచక్రవాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కువ శబ్దాలు వచ్చే హారన్లు, సైలెన్సర్లను వాహనాలకు బిగిస్తే చర్యలు చేపడతామని తేల్చిచెప్పారు. వాటిని విక్రయించే వారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- కత్తితో బెదిరించి చీర దొంగతనం- నిందితుడిపై ఎన్​ఎస్​ఏ కేసు

Last Updated : Jul 10, 2021, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.