ETV Bharat / bharat

కన్యత్వ పరీక్షలో విఫలం- ఇంటి నుంచి వెళ్లగొట్టిన భర్తలు - కంజర్‌భట్ వర్గం

కన్యత్వ పరీక్షలో విఫలమయ్యారనే సాకుతో వివాహమైన మూడు రోజులకే తమ భార్యలను పుట్టింటికి పంపించారు ఇద్దరు వ్యక్తులు. మహారాష్ట్ర కొల్హాపూర్​కు చెందిన అక్కాచెల్లెళ్లను వివాహమాడిన కర్ణాటక బెల్గాం​ వాసులు ఈ దారుణానికి పాల్పడ్డారు. 2020 నవంబర్ ఈ ఘటన జరగ్గా.. మూఢ నమ్మకాల నిర్మూలన సంస్థకు బాధితులు రాసిన లేఖ ద్వారా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

In laws from Belgaum sent the sisters to their native place,  Kolhapur, after failing the virginity test
కన్యత్వ పరీక్షలో విఫలమయ్యారని ఇంటి నుంచి వెళ్లగొట్టిన భర్తలు
author img

By

Published : Apr 9, 2021, 5:09 PM IST

సాంకేతిక యుగంలోనూ అశాస్త్రీయ సంప్రదాయాలను ఆచరిస్తున్నారు కొందరు. భార్యల హుందాతనాన్ని కాపాడాల్సింది పోయి రకరకాలుగా వేధిస్తున్నారు. కొత్తగా పెళ్లైన ఇద్దరు అక్కాచెల్లెళ్లలో ఒకరు కన్యత్వ పరీక్షలో విఫలమయ్యారని మహారాష్ట్ర కొల్హాపూర్​కు చెందిన ఇద్దరు వధువులను ఇంటినుంచి వెళ్లగొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పరీక్షలో విఫలం-తెగదెంపులు..

కంజర్‌భట్ వర్గానికి చెందిన యువతులకు వివాహ అనంతరం కన్యత్వ పరీక్ష నిర్వహించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఇదే వర్గానికి చెందిన ఇద్దరు యువతులు.. 2020 నవంబర్ 27న కర్ణాటక బెల్గాంకు చెందిన అన్నాదమ్ముళ్లను వివాహం చేసుకున్నారు. వివాహమైన మూడు రోజుల అనంతరం అత్తింటివారు నవవధువులకు కన్యత్వ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఒకరు విఫలమయ్యారు. అప్పటినుంచి వరుడి తల్లి ఆమెను పదేపదే వేధిస్తూ ఉండేది. ఆమెకు మర్యాద తెలియదని హింసిస్తూ ఉండేది. చివరకు ఇద్దరినీ పుట్టింటికి పంపించేశారు.

అంతటితో ఆగక 2021 ఫిబ్రవరి 28న.. స్థానిక రాజారాంపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆలయంలో కుల పంచాయతీ ఏర్పాటు చేశారు. తమ భర్తలతో, అత్తమామలతో యువతులకు ఎలాంటి సంబంధం లేదని తీర్పు చెప్పారు పెద్దలు. సర్పంచ్ ముందే ఈ వింత నిర్ణయం వెలువడటం గమనార్హం. దీంతో చేసేదిలేక పుట్టింటింకి చేరారు ఆ యువతులు.

ఆలస్యంగా వెలుగులోకి..

తమకు నిర్వహించిన కన్యత్వ పరీక్ష గురించి, కుల పంచాయతీ తీర్పు గురించి బాధిత యువతులు మహారాష్ట్ర మూఢవిశ్వాసాల నిర్మూలన సమితికి(ఏఎన్​ఐఎస్​) లేఖ రాశారు. తమకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పెళ్లి చేసుకుని అత్తింట్లో అడుగుపెట్టిన తమ పట్ల ఆ కుటుంబం అన్యాయంగా ప్రవర్తించిందని పేర్కొన్నారు.

తమ సంస్థకు ఈ తరహా ఫిర్యాదులు అనేకం వస్తుంటాయని ఏఎన్​ఐఎస్ సభ్యురాలు గీతా హసుర్కర్ వివరించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై రాజారంపురి పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

''కాలం వేగంగా మారుతోంది. ఈ కన్యత్వ పరీక్షలు అశాస్త్రీయమైనవి. కేవలం లైంగిక సంపర్కం ద్వారా మాత్రమే ఒక మహిళ తన కన్యత్వాన్ని కోల్పోదు. ఈత కొట్టడం, సైకిల్​ తొక్కడం వంటి పనుల వల్ల సైతం కోల్పోవచ్చు. కన్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం.''

-గీతా హసూర్కర్, మహారాష్ట్ర మూఢవిశ్వాసాల నిర్మూలన సమితి

మరోవైపు ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరి భర్త సైన్యంలో పనిచేస్తున్నాడు. వీరు చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలిపాడు. వారిని చంపుతానని బెదిరించాడు.

ఇవీ చదవండి: మరణంలోనూ వీడని హిందూ-ముస్లిం​ స్నేహం

మూగజీవాలను వదిలేసి.. ముగ్గురు భార్యలతో పరార్​

అక్కపైనే హత్యాచారం- బాక్స్​లో బాడీ పెట్టి పరార్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.