చావు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు కర్ణాటకలో ఓ కార్మికుడు. రామనగర జిల్లాకు చెందిన రాజన్న అనే వ్యక్తి.. పైపులైన్లు వేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ పైపులో చిక్కుకుపోయాడు. సుమారు అరగంట పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అందులోనే బిక్కుబిక్కుమంటూ గడిపాడు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో మట్టిని తవ్వేసి.. పైపును పగలగొట్టారు. ఆ తర్వాత రాజన్నను బయటకు లాగారు.
దీంతో అప్పటికే అక్కడికి చేరుకున్న పదుల సంఖ్యలో జనం.. చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డా.అశ్వత్ నారాయణ కూడా ఆగ్నిమాపక సిబ్బందిని అభినందించారు.
ఇదీ చూడండి: పోటెత్తిన వరద- బిక్కుబిక్కుమంటూ 20 గ్రామాల ప్రజలు