తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళతో మాట్లాడిన పార్టీ నేతలపై వేటు వేసింది అన్నాడీఎంకే(AIADMK). పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో ఆ పార్టీ అధికార ప్రతినిధి వీ పుగళేంది సహా 16 మందిని బహిష్కరించింది.
అంతా డ్రామా..
పార్టీ నేతలతో శశికళ మాట్లాడటాన్ని ఒక 'డ్రామా'గా అభివర్ణించింది అన్నాడీఎంకే. ఒక కుటుంబం కోసం పార్టీ ఎప్పటికీ తనను తాను నాశనం చేసుకోదని స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: 'అన్నాడీఎంకేలో శశికళకు స్థానం లేదు'