ETV Bharat / bharat

ఫిబ్రవరి 1 నుంచి డాక్టర్ల సమ్మె: ఐఎంఏ - Save Healthcare India Movement

శస్త్రచికిత్సలు చేయడానికి ఆయుర్వేద వైద్యులకూ అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దేశావ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) తెలిపింది. ప్రభుత్వం స్పందించకపోతే ఫిబ్రవరి 1 నుంచి సమ్మెకు దిగనున్నట్లు స్పష్టం చేసింది.

IMA announces relay hunger strike of doctors  from Feb 1 against AYUSH ministry notification
ఫిబ్రవరి 1 నుంచి డాక్టర్ల సమ్మె
author img

By

Published : Jan 22, 2021, 5:50 AM IST

ఆయుర్వేద వైద్యులూ శస్త్ర చికిత్సలు చేయవచ్చంటూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్​కు వ్యతిరేకంగా భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి దేశవ్యాప్తంగా డాక్టర్లందరూ సామూహిక నిరాహర దీక్షకు దిగుతున్నట్లు తెలిపింది. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాస్తామని ఐఎంఏ పేర్కొంది. ఆయుష్​మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్​ అశాస్త్రీయంగా ఉందని స్పష్టం చేసింది.

ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 'సేవ్​ హెల్త్​కేర్ మూమెంట్' ను ప్రారంభించాలని పిలుపునిచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశలో ఉండే ప్రజల ఆరోగ్యానికి పొంచి ఉండే ముప్పుని వివరించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి 24x7 వైద్యులు నిరాహార దీక్షలో కూర్చుంటారని స్పష్టం చేసింది. ఈ అంశంపై అవగాహన కల్పించడానికి పోస్టర్లు, బ్యానర్‌లను విడుదల చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి: ఆయుర్వేద శస్త్రచికిత్స అనుమతిపై వైద్యుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.