ETV Bharat / bharat

పెంపుడు జంతువులుగా 'డైనోసర్ బల్లులు'... రూ.9వేలు పెడితే... - దక్షిణ అమెరికా జాతి బల్లులు

Igunas in Malappuram: కేరళకు చెందిన జంతు ప్రేమికుడు వినూత్మ ఒరవడికి శ్రీకారం చుట్టాడు. మలప్పురానికి చెందిన సునీర్ అనే వ్యక్తి విదేశాలకు చెందిన బల్లులను పెంచుకుంటున్నాడు. ఈ బల్లులు.. సునీర్​కు బాగా మచ్చిక అయిపోయాయి. అతడి భుజాలపై ఆడుకుంటున్నాయి. డైనోసర్ల మాదిరిగా ఉన్న ఇవి అంత ప్రమాదకరం కావని సునీర్ చెబుతున్నాడు.

foreign igunas
విదేశీ బల్లులను పెంచుతున్న సునీర్
author img

By

Published : Mar 20, 2022, 2:02 PM IST

కేరళ బల్లుల పెంపకం

Igunas in Malappuram: కుక్కలు, పిల్లులు, చిలుకలు, తాబేళ్లను ఇళ్లలో పెంచుకోవడం ప్రస్తుత కాలంలో సహజమే. కానీ, కేరళలో ఓ జంతు ప్రేమికుడు వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టాడు. మంజేరి సమీపంలోని కరాకన్నుకు చెందిన సునీర్ అనే వ్యక్తి.. విదేశీ జాతికి చెందిన బల్లులను పెంచుతున్నాడు.

suneer igunas
సునీర్ భుజాలమీద పెంపుడు బల్లులు

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ..

దక్షిణ అమెరికా జాతికి చెందిన ఐదు బల్లులను రెండున్నరేళ్లుగా పెంచుతున్నాడు సునీర్. వీటికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. సునీర్ పెంచుకుంటున్న ఓ ఆడబల్లి ఏకంగా 40 గుడ్లు పెట్టింది. ఒకరి పెంపకంలో బల్లి ఇన్ని గుడ్లు పెట్టడం చాలా అరుదు.

suneer igunas
పెంపుడు బల్లులతో సునీర్

ఈ రకం బల్లులు.. చూసేందుకు భయంకరంగా ఉంటాయి. డైనోసర్లను పోలిన రూపంలో వింతగా కనిపిస్తాయి. అయితే, వీటితో మనుషులకు ఎటువంటి అపాయం ఉండదు. ఇవి ఆకులు, కూరగాయలు మాత్రమే తింటాయి. గత రెండేన్నరేళ్లుగా వీటిని పెంచుతున్న సునీర్​కు ఇవి బాగా మచ్చిక అయిపోయాయి.

suneer igunas
సునీర్ పెంపుడు బల్లులు

ఈ బల్లుల గుడ్లు పొదిగేందుకు 65నుంచి 90 రోజులు పడుతుందని చెబుతున్నాడు సునీర్. ఈ బల్లులు ఇసుక గుంతలలో గుడ్లు పెడతాయని... తల్లి సంరక్షణ లేకుండానే.. వాటంతట అవే పొదుగుతాయని తెలిపాడు. అయితే ఈ గుడ్ల భద్రత కోసం ప్రత్యేకంగా కుండను తయారుచేశానని సునీర్ తెలిపాడు.

రంగు, పరిమాణం బట్టే ధరలు..

ఈ బల్లుల ధర.. వాటి పరిమాణం, రంగు మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు సునీర్. ఆకుపచ్చ బల్లులకు రేటు కాస్త తక్కువేనని.. మిగతా రంగు బల్లులకు ధర అధికంగా ఉంటుందని చెబుతున్నాడు. పెద్ద బల్లుల విలువ రూ.25000 వరకు ఉంటుందని, చిన్న బల్లి విలువ సుమారు రూ.9000 ఉంటుందని తెలిపాడు.

suneer igunas
సునీర్ పెంపుడు బల్లి

ఇదీ చదవండి: చకచకా కొబ్బరిచెట్టు ఎక్కేస్తున్న 68 ఏళ్ల బామ్మ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.