దిల్లీ విద్యాశాఖ కార్యదర్శి ఉదిత్ రాయ్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులతో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. 'ఏదో ఒకటి రాసి పేపర్లు నింపండి' అంటూ.. విద్యార్థులతో రాయ్ సంభాషిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
"మీకు సమాధానాలు తెలియకపోతే ఏదో ఒకటి రాయండి. ప్రశ్నల్నే మళ్లీ కింద నింపినా అభ్యంతరం లేదు. కానీ జవాబు పత్రాలను ఖాళీగా ఉంచొద్దు. మేము మీ ఉపాధ్యాయులతో మాట్లాడాము. మీరు ఏదో ఒక జవాబు రాస్తే సరిపోతుందన్నారు. మీరు ఏది రాసినా మార్కులు వేయమని సీబీఎస్ఈకి కూడా చెప్పాను."
-ఉదిత్ రాయ్, విద్యాశాఖ డైరెక్టర్
ఈ వీడియోపై స్పందించిన ప్రతిపక్షాలు.. కేజ్రీవాల్ ప్రభుత్వంపై మండిపడ్డాయి. 'మీరు ఇలాగే పరీక్షలు రాసి ఐఏఎస్ అయ్యారా?' అని భాజపా నేతలు ఎద్దేవా చేశారు. 'కేజ్రీవాల్ జీ, ఇదేం విద్యా విధానం? విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోకండి,' అని కాంగ్రెస్ అభ్యర్థించింది.
-
केजरीवाल जी ये कैसा शिक्षा मॉडल है आपका
— Delhi Congress (@INCDelhi) February 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
दिल्ली के शिक्षा निदेशक उदित प्रकाश बच्चों को बता रहे है अगर पेपर में कुछ न आये तो उत्तर की जगह प्रशन ही लिख दो
हमने CBSE से बात कर रखी है नम्बर मिल जाएंगे।
बच्चों के भविष्य से खिलवाड़ बंद कीजिए@ArvindKejriwal @msisodia #बर्बादी_के_6_साल pic.twitter.com/31D2BrS0wx
">केजरीवाल जी ये कैसा शिक्षा मॉडल है आपका
— Delhi Congress (@INCDelhi) February 18, 2021
दिल्ली के शिक्षा निदेशक उदित प्रकाश बच्चों को बता रहे है अगर पेपर में कुछ न आये तो उत्तर की जगह प्रशन ही लिख दो
हमने CBSE से बात कर रखी है नम्बर मिल जाएंगे।
बच्चों के भविष्य से खिलवाड़ बंद कीजिए@ArvindKejriwal @msisodia #बर्बादी_के_6_साल pic.twitter.com/31D2BrS0wxकेजरीवाल जी ये कैसा शिक्षा मॉडल है आपका
— Delhi Congress (@INCDelhi) February 18, 2021
दिल्ली के शिक्षा निदेशक उदित प्रकाश बच्चों को बता रहे है अगर पेपर में कुछ न आये तो उत्तर की जगह प्रशन ही लिख दो
हमने CBSE से बात कर रखी है नम्बर मिल जाएंगे।
बच्चों के भविष्य से खिलवाड़ बंद कीजिए@ArvindKejriwal @msisodia #बर्बादी_के_6_साल pic.twitter.com/31D2BrS0wx
సీఎంకు లేఖ..
ఈ వివాదంపై అఖిల భారత తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు అశోక్ అగర్వాల్ సీఎం కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. సంబంధిత అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి అయిన సిసోడియా కూడా ఇందుకు బాధ్యత వహించాలన్నారు.
ఇదీ చదవండి : 'రైతులతో చర్చలకు ఇప్పటికీ సిద్ధమే'