ETV Bharat / bharat

మొరిగే జింక పిల్ల హల్​చల్​.. ఊర్లో చేరి రచ్చ రచ్చ - ఇడుక్కి జింకపిల్ల

Idukki deer: అరుదైన జాతికి చెందిన మొరిగే జింకపిల్ల ఒకటి దారితప్పి ఊర్లోకి వచ్చింది. బిగ్గరగా అరుస్తూ ఊరంతా తిరిగింది. గ్రామస్థులు పట్టుకునేందుకు ప్రయత్నించగా.. తప్పించుకుని పరుగులు పెట్టింది. ఊర్లోని అన్ని దుకాణాల్లో దూరి రచ్చ రచ్చ చేసింది.

Idukki deer
దారితప్పిన జింక పిల్ల.. ఊర్లో చేరి రచ్చ రచ్చ
author img

By

Published : Jan 14, 2022, 12:23 PM IST

Updated : Jan 14, 2022, 1:19 PM IST

దారితప్పిన జింక పిల్ల.. ఊర్లో చేరి రచ్చ రచ్చ

Idukki deer: అత్యంత అరుదుగా కనిపించే జింకపిల్ల ఒకటి కేరళ ఇడుక్కిలోని కూట్టర్​లో హల్​చల్​ చేసింది. మొరుగుతూ.. ఊరంతా తిరిగింది. దారితప్పి ఊర్లోకి వచ్చి.. గ్రామస్థులను పరుగులు పెట్టించింది. దాదాపు ఊర్లోని అన్ని దుకాణాల్లోకి దూరి బీభత్సం చేసింది. చివరకు గ్రామస్థులు దాన్ని బంధించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అనంతరం వాళ్లు అడవిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు.

Barking deer strays to shops in Koottar Town
దారితప్పిన జింకపిల్ల.. ఊర్లో చేరి రచ్చ రచ్చ

ఇదీ జరిగింది..

కూట్టర్​లోకి జింకపిల్ల గురువారం మధ్యాహ్నం ప్రవేశించింది. అడవి నుంచి దారితప్పి నది, వంతెనను దాటి ఊర్లోకి వచ్చింది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న వాహనాలను చూసి బయపడి అరవడం ప్రారంభించింది. అది చూసిన గ్రామస్థులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వాళ్ల నుంచి తప్పించుకుని అది పరుగులు పెట్టింది. ఊర్లోని దుకాణాలన్నింటినీ చుట్టేసింది. ఓ షాపు యజమాని జింకపిల్లను చూసి భయంతో బయటకు ఎగిరిదూకాడు. చివరకు ఎలాగోలా జింకపిల్లను పట్టుకున్నారు స్థానికులు. అది షాపులో ఉండగా.. ఓ బస్తాలో బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

అటవీప్రాంత సమీపంలో ఉన్న ఇడుక్కి జనావాసాల్లోకి అప్పుడప్పుడు పులులు, ఏనుగులు వస్తుంటాయి. జింకపిల్ల రావడం ఇదే తొలిసారి. దీంతో అనుకోని అతిథి రావడం చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇదీ చదవండి: పోలీస్​​ 'ఛేజింగ్​ సీన్' సూపర్​​- కూలీ ఫోన్​ను దొంగ ఎత్తుకెళ్తుండగా..

Last Updated : Jan 14, 2022, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.