ETV Bharat / bharat

'సాగు చట్టాలు ఎలా ఉన్నాయో ఓ ఏడాది చూడండి' - amit sha on farmers protest

సాగు చట్టాలపై ఉద్యమిస్తోన్న రైతులు చర్చకు రావాలని రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ కోరారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేకూరుస్తాయని భరోసా ఇచ్చారు.

Rajnath Singh
'ఓ ఏడాది పాటు చూడండి.. ఇప్పుడు చర్చలకు రండి'
author img

By

Published : Dec 25, 2020, 1:17 PM IST

Updated : Dec 25, 2020, 1:56 PM IST

నూతన సాగు చట్టాలు ఏడాది పాటు అమలయ్యే వరకు రైతులు వేచి చూడాలని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ అన్నారు. అప్పటికీ రైతుల అభిప్రాయం మారకపోతే చట్టాలను సవరించడానికి సిద్ధమని స్పష్టం చేశారు​. దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తోన్న రైతులపై తమకు అపారమైన గౌరవం ఉందన్నారు రాజ్​నాథ్​.

"సాగు చట్టాలపై ఉద్యమిస్తోన్న రైతులు చర్చకు రండి. దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తోన్న వారందరూ రైతులు, రైతు బిడ్డలే. మీపై మాకు అపారమైన గౌరవం ఉంది. మా ప్రభుత్వం రైతులకు హాని కలిగించే చట్టాలు చేయదు. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవచ్చు. రైతులతో చర్చలు కొనసాగించాలని ప్రధాని కోరుకుంటున్నారు.

ఓ ఏడాది పాటు ఈ చట్టాలను అమలు చేద్దాం. రైతులకు మేలు చేకూరలేదు అనుకుంటే సవరణలకు సర్కార్​ సిద్ధంగా ఉంది."

- రాజ్​నాథ్​ సింగ్, రక్షణ మంత్రి

మోదీ ఉండగా అసాధ్యం..

సాగు చట్టాలపై రైతులు అపోహలను నమ్మొద్దని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సూచించారు. మోదీ దేశ ప్రధానిగా ఉన్నంత కాలం ఏ కార్పొరేట్​ శక్తులు.. రైతుల భూమిని లాక్కోలేవని అమిత్​ షా హామీ ఇచ్చారు.

"సాగు చట్టాలపై విపక్షాలు అసత్యాలు చెబుతున్నాయి. ఎమ్​ఎస్పీ కొనసాగిస్తాం, మండీలు రద్దు చేయమని నేను మరోసారి హామీ ఇస్తున్నాను. రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం."

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

Last Updated : Dec 25, 2020, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.