Hyderabad Girl Killed in US Shootout : అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలవరం కలిగిస్తున్నాయి. శనివారం జరిగిన కాల్పుల్లో తెలుగమ్మాయి మృతి చెందింది. టెక్సాస్‌లోని డాలస్‌కు ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలెన్ ప్రీమియర్ దుకాణ సముదాయంలో(మాల్) ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఓ దుండగుడు చొరబడి.. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
Hyderabad Student Killed in America Shootout : ఈ దుర్ఘటనలో మాల్ సెక్యూరిటీ గార్డ్ సహా 8 మంది మరణించారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మాల్ లోకి ప్రవేశించే ముందే సాయుధుడు... ఓ పోలీసు అధికారిని కూడా పొట్టనబెట్టుకున్నట్లు తెలిసింది. ఈ కాల్పుల్లో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా ఇందులో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ కాల్పుల్లో తెలంగాణకు చెందిన 27 ఏళ్ల తాటికొండ ఐశ్వర్య కూడా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఐశ్వర్య తండ్రి నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పని చేస్తున్నారు.
'ఉద్యోగ రీత్యా అమెరికా వెళుతున్న వారికి ఎటువంటి సోషల్ సెక్యూరిటీ లేదు. ఐశ్వర్య మృతిపై న్యాయవాదులందరం చాలా బాధపడుతున్నాం. అమెరికాలో తొంభై శాతం మంది తెలుగువారు టెక్సాస్ నగరంలోనే ఉంటారు. టెక్సాస్ నగరంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో చర్యలు జరిపి ఈ గన్ కల్చర్ విధానంపై సత్వరమే చర్యలు చేపట్టాలి. వీకెండ్ కావడంతో ఐశ్వర్య గ్రాసరీస్ కోసం వెళ్లి ఇలా మృత్యు ఒడికి చేరడం చాలా బాధాకరం. డిసెంబర్లో ఆ అమ్మాయికి పెళ్లి చేయాలనే యోచనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇంతలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం.'-కొంతం గోవర్దన్ రెడ్డి, న్యాయవాది
ఐశ్వర్య మృతితో హైదరాబాద్ కొత్తపేటలోని ఆమె నివాసం వద్ద విషాదం నెలకొంది. తాటికొండ ఐశ్వర్య పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కూతురి మరణవార్త తెలిసి ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమెరికాలో స్థిరపడిన అమ్మాయి ఇలా దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీరి స్వస్థలం నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్లగా తెలుస్తోంది. అమెరికాలో గన్ సంప్రదాయంపై అధ్యక్షుడు వెంటనే ఆంక్షలు విధించాలని రంగారెడ్డి జిల్లా న్యాయవాదులు డిమాండ్ చేశారు.
'ఐశ్వర్య మృతి మమ్మల్ని చాలా బాధించింది. అమెరికాలో గన్ కల్చర్ విధానం సమసిపోవాలి. అమెరికా అధ్యక్షుడు గన్ కల్చర్ విధానంపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రధాని మోదీ కూడా అమెరికా అధ్యక్షుడితో మాట్లాడి దీనిపై చర్యలు జరపాలి. గన్ కల్చర్ విధానం భద్రతా మండలి కూడా సమగ్ర విచారణ జరపాలి. గన్ కల్చర్ వల్ల అమెరికాలో లక్షల మంది చనిపోతున్నారు. ప్రధాని మోదీ గన్ కల్చర్‌ను రూపు మాపేలా చర్చలు జరపాలని రంగారెడ్డి జిల్లా న్యాయవాదులందరం డిమాండ్ చేస్తున్నాం.' - రాజి రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, రంగారెడ్డి జిల్లా
ఐశ్వర్య మృతి ఎంతో బాధించింది: శనివారం అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన దుండగుడి కాల్పుల్లో తెలుగు బిడ్డ ఐశ్వర్య మృతి చెందడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఐశ్వర్య మృతి ఎంతో బాధించిందన్న రేవంత్.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఐశ్వర్య భౌతిక కాయాన్ని స్వస్థలానికి చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ట్విటర్ వేదికగా రేవంత్‌రెడ్డి కోరారు.
-
నిన్న అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన దుండగుడి కాల్పుల్లో తెలుగు బిడ్డ ఐశ్వర్య మృతి చెందడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఐశ్వర్య భౌతిక కాయాన్ని స్వస్థలానికి చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి.@TelanganaCMO
— Revanth Reddy (@revanth_anumula) May 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">నిన్న అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన దుండగుడి కాల్పుల్లో తెలుగు బిడ్డ ఐశ్వర్య మృతి చెందడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఐశ్వర్య భౌతిక కాయాన్ని స్వస్థలానికి చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి.@TelanganaCMO
— Revanth Reddy (@revanth_anumula) May 8, 2023నిన్న అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన దుండగుడి కాల్పుల్లో తెలుగు బిడ్డ ఐశ్వర్య మృతి చెందడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఐశ్వర్య భౌతిక కాయాన్ని స్వస్థలానికి చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి.@TelanganaCMO
— Revanth Reddy (@revanth_anumula) May 8, 2023
ఇవీ చదవండి: