ETV Bharat / bharat

కశ్మీర్​లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం - ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్​ అవంతిపొరా జిల్లాలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి సైనిక దళాలు. స్థానిక పోలీసులు, సైన్యం, సీఆర్​పీఎఫ్​ బలగాలు.. సంయుక్త ఆపరేషన్​ నిర్వహించి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.

Terrorists
కశ్మీర్​లో భారీ ఉగ్ర కుట్ర
author img

By

Published : May 31, 2021, 7:15 PM IST

జమ్ముకశ్మీర్​లో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి భద్రతా బలగాలు. అవంతిపొరా జిల్లా త్రాల్​ ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.

విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు అవంతిపొరా పోలీసులు, ఆర్మీ 42ఆర్​ఆర్​, సీఆర్​పీఎఫ్​ 180 బెటాలియన్​ బలగాలు సంయుక్త ఆపరేషన్​ నిర్వహించాయి. త్రాల్​లోని సిమోహ్​ నల్లా​ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా.. 50-60 లీటర్ల సామర్థ్యం ఉన్న ఓ ప్లాస్టిక్​ కంటెయినర్​ నిండా ఐఈడీ సామగ్రిని గుర్తించాయి.

  • గన్​ పౌడర్​(అమోనియా).. సుమారు 40-50 కిలోలు
  • ఎలక్ట్రిక్​ డిటొనేటర్స్​... 2
  • కార్డెక్స్​ వైర్​... 4 మీటర్లు
  • ఎలక్ట్రిక్​ కమాడ్​ వైర్​.. 100 మీటర్లు

స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను ఫోరెన్సిక్​ పరీక్షలకు పంపించారు. త్రాల్​ స్టేషన్​లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఇదీ చూడండి: మోదీ X దీదీ: సీఎస్​ విషయంలో మమత సూపర్ స్కెచ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.