ETV Bharat / bharat

లక్ష్మీ కటాక్షం పొందాలా? ఈ పనులు చేస్తే దేవీ అనుగ్రహం! - How to Get Lakshmi Devi Blessings

How to Get Goddess Lakshmi Devi Blessings: సర్వ సంపదలకూ అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా ఇబ్బందులు పడాల్సిందే. అయితే.. ఆ తల్లి అనుగ్రహం కోసం కొన్ని పనులు చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 4:11 PM IST

How to Get Goddess Lakshmi Devi Blessings : కొంతమంది ఎంత కష్టపడ్డా ఇంట్లో డబ్బు నిలవదు. దీంతో అప్పులతోనే కాలం వెళ్లదీయాల్సి వస్తుంది. అయితే ఈ పరిస్థితికి కారణం.. లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడమే అని పండితులు చెబుతున్నారు. సంపద, శ్రేయస్సు, శక్తి, సంతానోత్పత్తికి ప్రతీకగా నిలిచే దేవత లక్ష్మీదేవి. ఆ దేవత అనుగ్రహం కోసం కొన్ని పనులు చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని జపించడం: లక్ష్మీ గాయత్రీ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించడం వల్ల లక్ష్మీ దేవి ఎంతో సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు. 'కమల్ గట్ట మాల'తో (తామర గింజల మాల) ఈ మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారిని పూజిస్తే దారిద్య్రం తొలగిపోయి సిరిసంపదలు కలుగుతాయని చెబుతున్నారు.

లక్ష్మీదేవి పాదముద్రలు: మీ పూజా మందిరంలో లక్ష్మీ దేవి పాదముద్రలను గీయడం లేదా పాద ముద్రికల పటాలను పెట్టి పూజలు చేయాలని చెబుతున్నారు. దీనివల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం లభించి పాపాలు, శాపాలు అన్నీ తొలగిపోతాయని.. సంపదతోపాటు శాంతి కూడా ప్రాప్తిస్తుందని అంటున్నారు.

'నోట్లపై లక్షీదేవి ఉంటే 'రూపాయి' చల్లగా ఉంటుంది'

నెయ్యి దీపాలు: తామర పువ్వులు, కొబ్బరి, ఖీర్ వంటి పదార్థాలను అమ్మవారికి నైవేద్యం పెట్టాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ప్రతిరోజూ నెయ్యితో రెండు దీపాలను వెలిగించి పూజ చేయాలంటున్నారు.

తామర వత్తులతో దీపారాధన: లక్ష్మీదేవి తామరపువ్వులపై ఆసీనులై దర్శనమిస్తుంది. అందుకు గానూ తామర వత్తులను తయారు చేసి శుక్రవారాల్లో మట్టి ప్రమిదలో తొమ్మిది తామర వత్తులు, నెయ్యితో దీపం వెలిగించండి. దీంతో లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు.

తులసి పూజ: శాస్త్రాల ప్రకారం తులసి దేవిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. తులసి మొక్క ఉన్న ఇంట్లో విష్ణుమూర్తి అనుగ్రహం కచ్చితంగా ఉంటుంది. అందుకే మీ ఇంట్లో తులసి మొక్కను నాటాలి. ప్రతిరోజూ తులసి మొక్కకు పూజ చేసి నీరు సమర్పించి దీపం వెలిగించాలి. తులసిని ఇంటికి ఈశాన్య దిశలో నాటాలి. దీంతో దేవి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

సముద్రపు గవ్వలు: ఇంట్లో సముద్రపు గవ్వలను పెడితే పాజిటివ్ ఎనర్జీస్ ఎట్రాక్ట్ అవుతాయి. ముఖ్యంగా పూజ గదిలో శంఖం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం దండిగా లభిస్తుందని నమ్మకం. ఇంటి పూజ గదిలో శంఖాన్ని పవిత్ర స్థలంలో ఉంచాలి. దీంతో.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్లి, కుబేరుని అనుగ్రహంతో సంపద, శ్రేయస్సు అందుతాయట.

ఆవ నూనె దీపం : ఇంట్లో లక్ష్మీ కటాక్షం పొందాలంటే ప్రతి రోజూ సాయంత్రం ఆవ నూనె దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందట.

ఇకపై అమ్మవారికి కూడా 'కాంగ్రెస్​ గృహలక్ష్మి' డబ్బులు​- నెలకు రూ.2వేలు డిపాజిట్- ఆ తర్వాతే రాష్ట్ర మహిళలకు!

కొత్త ఇంటికి పేరు పెడుతున్నారా? - ఈ వాస్తు సూచనలు పాటించాల్సిందేనట!

ఇంట్లో ఆ జంతువులను పెంచుతున్నారా? - వాస్తు శాస్త్రం ప్రకారం ఏమవుతుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.