ETV Bharat / bharat

భారత్-చైనాల మధ్య 'హాట్‌లైన్' - భారత్-చైనా సైన్యాల మధ్య హాట్‌లైన్

వాస్తవాధీన రేఖ వెంబడి విశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా భారత-చైనా మధ్య ఓ హాట్​లైన్ ఏర్పాటైంది. ఇరుదేశాల సైనికుల మధ్య గతకొన్నాళ్లుగా ఘర్షణ నెలకొన్నందున.. కమాండర్ల స్థాయిలో అత్యవసర సంభాషణలకు ఈ హాట్​లైన్ ఉపయోగపడనుంది.

HOTLINE
భారత్-చైనాల మధ్య 'హాట్‌లైన్'
author img

By

Published : Aug 2, 2021, 4:49 AM IST

Updated : Aug 2, 2021, 5:47 AM IST

భారత్-చైనాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సైనికుల అత్యవసర సంభాషణకు వీలుగా 'హాట్​లైన్​' ఏర్పాటైంది. గతకొన్నాళ్లుగా సైనికుల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన నేపథ్యంలో చర్చలు ప్రారంభించిన ఇరుదేశాలు సిక్కింలో ఈ హాట్‌లైన్ ఏర్పాటుకు అంగీకరించాయి. భారత్-చైనాల కమాండర్ల స్థాయిలో కమ్యూనికేషన్ కోసం ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. ఈ హాట్‌లైన్‌ ఏర్పాటుతో సరిహద్దుల్లో శాంతి నెలకొంటుందని భావిస్తున్నారు.

ఉత్తర సిక్కింలోని కొంగ్రాలాలోని భారత సైన్యం-టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని ఖంబాజోంగ్ వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్​ఏ) మధ్య ఈ హాట్‌లైన్ ఉండనుంది. తూర్పు లద్దాక్​లో ఘర్షణపూరిత వాతావరణంతో ఇరుదేశాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతున్న తరుణంలో ఈ హాట్‌లైన్ ఏర్పాటు కావడం విశేషం.

'సరిహద్దు వెంబడి విశ్వాసం, స్నేహపూర్వక సంబంధాలను' పెంచడమే ఈ హాట్‌లైన్ లక్ష్యమని భారత ఆర్మీ తెలిపింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత్-చైనాల గ్రౌండ్ కమాండర్లు హాజరయ్యారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 2, 2021, 5:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.