మధ్యప్రదేశ్లోని ఆగర్ మాల్వా జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు కొవిడ్ బారిన పడినా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ధనియాఖేడి గ్రామానికి సమీపంలోనీ ఓ నారింజ తోటలోనే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు ప్రైవేటు వైద్యులు. చెట్టు కొమ్మలకే సెలైన్ బాటిళ్లు వేలాడ దీస్తూ.. నేలపైనే తాత్కాలిక పడకలు ఏర్పాటు చేశారు. చుట్టు పక్కల 10 గ్రామాలకు చెందిన ప్రజలు కరోనా బారినపడితే ఇక్కడికే వస్తున్నారు. వారిని కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనాలపై ఇక్కడికి తీసుకువస్తున్నారు.
తమకు కరోనా సోకినా భయం లేదని, కానీ ప్రభుత్వ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చేరి చికిత్స తీసుకునే సాహసం చేయబోమని ఇక్కడున్న రోగుల కుటుంబ సభ్యులు చెప్పారు. జిల్లాలోని ఆస్పత్రులలో సరైన సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆక్సిజన్ పేరుతో సీఓ2 సిలిండర్ల విక్రయం