ETV Bharat / bharat

Horoscope Today (21-12-2021): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today: ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
ఈ రోజు రాశి ఫలం
author img

By

Published : Dec 21, 2021, 4:32 AM IST

Horoscope Today: ఈరోజు (21-12-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం హేమంత రుతువు; మార్గశిర మాసం; బహుళ పక్షం

విదియ: మ. 12.40 తదుపరి తదియ పునర్వసు: రా. 8.53 తదుపరి పుష్యమి

వర్జ్యం: ఉ. 7.46 నుంచి 9.30 వరకు తిరిగి తె. 5.29 నుంచి

అమృత ఘడియలు: సా.6.15 నుంచి 8.00 వరకు

దుర్ముహూర్తం: ఉ. 8.40 నుంచి 9.24 వరకు తిరిగి రా. 10.39 నుంచి 11.31 వరకు

రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు

సూర్యోదయం: ఉ.6.29

సూర్యాస్తమయం: సా.5-26

మేషం

చిత్తశుద్ధితో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయం వృథా కానీయకండి. నవగ్రహధ్యానం శుభప్రదం.

వృషభం

మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాల వల్ల మేలు జరుగుతుంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మానసిక పీడ ఉంటుంది. దుర్గాదేవి ఆరాధనతో మనోబలం చేకూరుతుంది.

మిథునం

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయం వృథా చేయకండి. ఇష్టదేవతారాధన శుభకరం.

కర్కాటకం

మంచి కాలం. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే ఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక శుభవార్త మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది. ఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం.

సింహం

శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు.

కన్య

శుభకాలం. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కాలం అన్నివిధాలా సహకరిస్తుంది. శ్రీవేంకటేశ్వరుని ఆరాధనతో శుభ ఫలితాలు కలుగుతాయి.

తుల

పనిలో శ్రమ పెరిగినప్పటికీ మనోభీష్టం నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

వృశ్చికం

ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో శుభఫలితాలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ముందడుగు పడుతుంది. లింగాష్టకం చదవాలి.

ధనుస్సు

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. బాగా కష్టపడితే తప్ప పనులు పూర్తవ్వవు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళితే మంచి జరుగుతుంది. ఆంజనేయ సందర్శనం శుభప్రదం.

మకరం

మిశ్రమ వాతావరణం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొన్ని వార్తలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కనకధారాస్తవం చదవాలి.

కుంభం

స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

మీనం

మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయస్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (డిసెంబర్‌ 19 - డిసెంబర్‌ 25)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.