Horoscope Today : ఈ రోజు (మే 14) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
![](https://assets.eenadu.net/article_img/mesham_2_4.jpg)
ఈ రోజు మీరు అభద్రతాభావంతో ఉంటారు. మీకు సన్నిహితంగా ఉండేవారి ఉద్దేశాలు, ఆలోచనల విషయంలోనూ అనుమానాలు కలుగుతాయి. ఇంట్లో ఏదో తెలియని అశాంతి, ఆందోళన ఆవరించి ఉంటుంది. ఈ రోజు మీకు అంతగా కలిసిరాదు. జాగ్రత్తగా వ్యవహరించండి.
![](https://assets.eenadu.net/article_img/vrushabam_5.jpg)
ఈ రోజు మీకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయాలన్న కోరిక తీరుతుంది. ఖర్చులను కాస్త అదుపులో పెట్టుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.
![](https://assets.eenadu.net/article_img/midhunam_5.jpg)
ఈ రోజు మీరు పూర్తి ఏకాగ్రతతో మీకు అప్పగించిన పనిని పూర్తి చేస్తారు. పని పట్ల ఈ రోజు తపన కలిగి ఉంటారు. స్నేహితులను కలిసేందుకు వెళ్తారు.
![](https://assets.eenadu.net/article_img/karkatakam_2_4.jpg)
ఈ రోజంతా చికాకుగా, ఆందోళనగా ఉంటారు. కొత్త పనులు మొదలు పెట్టవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆఫీసుకు సంబంధించిన వ్యవహారాలు మీకు అంత అనుకూలంగా ఉండవు. మానసిక స్థితిని మెరుగుపరుచుకోండి.
![](https://assets.eenadu.net/article_img/simham_1_4.jpg)
మీకు ఈ రోజు అంత అనుకూలంగా లేదు. మీరు మీ జీవిత భాగస్వామితో వాదనలకు దిగే అవకాశం ఉంది. ఈ రోజు ఎవరితోనూ గొడవలకు దిగకండి. ఆరోగ్య సంబంధమైన సమస్యలు వస్తాయి. విదేశీయులను కలుసుకునే అవకాశం ఉంది.
![](https://assets.eenadu.net/article_img/kanya_1_4.jpg)
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది.
![](https://assets.eenadu.net/article_img/tula_1_4.jpg)
మీ బాస్ కోపాన్ని చవిచూస్తారు. మీ తోటి ఉద్యోగులు కూడా మీ పట్ల అయిష్టంగానే ఉంటారు. ఇంట్రవ్యూలో ఫెయిల్ అవుతారు. ఖర్చులను అదుపులో ఉంచుకోండి.
![](https://assets.eenadu.net/article_img/vruschikam_6.jpg)
ఈ రోజు మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులతో గొడవ పడే అవకాశం ఉంది. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. డాక్యుమెంట్లపై సంతకం పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి.
![](https://assets.eenadu.net/article_img/dhanussu_5.jpg)
మీకు ఈ రోజు ఆధ్యాత్మ వాతావరణంలో గడుపుతారు. చాలా సంతోషంగా ఉంటారు. మీ సోదరి, సోదరులతో సరదగా గడుపుతారు. ఈ రోజు మీకు బాగా కలిసివస్తుంది. కొత్తగా ఏదైనా పని ప్రారంభించాలంటే ఈ రోజు ప్రారంభించండి.
![](https://assets.eenadu.net/article_img/makaram_3_3.jpg)
ఈ రోజు మీ కుటుంబ సభ్యులకు అస్వస్థతకు గురవుతారు. దీంతో మీరు ఆందోళన చెందుతారు. మీరు ఈ రోజు ఎటువంటి సాహసోపేతమైన పని చేసినా విజయం సాధిస్తారు.
ఈరోజు మీరు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ధ్యానం చేయండి.
![](https://assets.eenadu.net/article_img/meenam_2_5.jpg)
ఈ రోజు మీరు నిరాశగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెట్టుబడులు ఆలోచించి పెట్టండి. కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.