ఈరోజు (19-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
- శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు;
- ఆశ్వయుజ మాసం శుక్లపక్షం చతుర్దశి: సా. 6.31
- పూర్ణిమ ఉత్తరాభాద్ర: మ.12.53
- రేవతి వర్జ్యం: రా.1.31 నుంచి 3.12 వరకు
- అమృత ఘడియలు: ఉ.7.55 నుంచి 9.34 వరకు
- దుర్ముహూర్తం: ఉ. 8.15 నుంచి 9.02 వరకు తిరిగి రా.10.30 నుంచి 11.20 వరకు
- రాహుకాలం: సా. 3.00 నుంచి 4.30 వరకు
- సూర్యోదయం: ఉ.5-56
- సూర్యాస్తమయం: సా.5-34
మేషం..
మీ మీ రంగాల్లో విజయ పరంపర కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈశ్వరారాధన శుభప్రదం.
వృషభం..
శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
మిథునం..
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. గణపతి స్తోత్రం పఠించడం మంచిది.
కర్కాటకం..
అర్థలాభం ఉంది. లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేయండి. ఆపదలు తొలుగుతాయి. ఇష్టదైవ స్తోత్రాలు చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
సింహం..
అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం.
కన్య..
ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.
తుల..
ప్రారంభించిన పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అనవసర ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. నవగ్రహ స్తోత్రం చదవండి, మంచి జరుగుతుంది.
వృశ్చికం..
ధర్మకార్యాచరణతో లక్ష్యాలను చేరుకుంటారు. తోటివారితో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
ధనస్సు..
ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి. బుద్ధిబలంతో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
మకరం..
మిశ్రమ కాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. శివారాధన శుభప్రదం.
కుంభం..
పెద్దల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ ఉత్సాహాన్ని భంగం చేయాలని చూస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శివారాధన శుభప్రదం.
మీనం..
మంచి కాలం. ఆర్థికంగా విజయం సాధిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. రాజదర్శన సల్లాపాలు, భోజన సౌఖ్యం లభిస్తాయి. శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది.