Horoscope Today (06-03-2022): ఈ రోజు పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. స్థిరనిర్ణయాలతో చేసే పనులు ఫలిస్తాయి. దుర్గాస్తుతిని పఠిస్తే బాగుంటుంది.
మధ్యమ ఫలితాలున్నాయి. ముఖ్య విషయాల్లో చంచల స్వభావం రానివ్వకండి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బందిపెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
ధనాగమనసిద్ధి ఉంది. సొంతింటి వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించడం మంచిది.
ముఖ్య కార్యాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణుసహస్రనామాలు పారాయణ చేయడం మంచిది.
అనుకూల ఫలితాలున్నాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చంద్ర ధ్యానం చేయడం మంచిది.
కీలక వ్యవహారాల్లో నీరసించకుండా ముందుకు సాగితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అందరినీ కలుపుకొనిపోవడం మంచిది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. సమయానికి నిద్రాహారాలు అవసరం. అష్టమ చంద్ర దోషం ఉంది. దుర్గాదేవి ప్రార్థన శుభప్రదం.
మీరుపనిచేసే రంగంలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆదిత్య హృదయ పారాయణం చేస్తే బాగుంటుంది.
సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం.
కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
సమయానుకూలంగా ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మి గణపతి ఆరాధనా శుభప్రదం.
పట్టుదలతో పనిచేస్తే మంచి ఫలితాలను సాధిస్తారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఒక వార్త మనోధైర్యాన్నిపెంచుతుంది. చంద్ర ధ్యానం శ్రేయోదాయకం.
వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలున్నాయి. చిత్తశుద్ధితో చేసే పనులు విశేష లాభాన్నిస్తాయి. భోజన సౌఖ్యం ఉంది. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల అంగీకారం తప్పనిసరి. దుర్గామాతను ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.