Horoscope Today 31st August 2023 : ఆగస్టు 31న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మీకు ఈరోజు చాలా బాగుంటుంది. సామాజిక కార్యక్రమాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు. స్నేహితుల నుంచి బహుమతులు స్వీకరిస్తారు. వారి కోసం ఖర్చులు చేస్తారు. పెద్దవాళ్లు మీపై ప్రేమను చూపిస్తారు. మీ సాన్నిహిత్య సంబంధాలు మరింత లోతుగా వెళ్తాయి. ఒక మంచి టూరిస్ట్ స్పాట్‌కు వెళ్తారు. మీ పిల్లల వల్ల లబ్ధి పొందుతారు.
వృషభం (Taurus) : ఈరోజు మీకు మంగళకరంగా ఉంటుంది. కొత్తగా వెంచర్స్‌ను ఆరంభిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా వృత్తిలో ఉన్న వారికి వ్యాపరస్థులకు ఈరోజు లాభదాయకంగా ఉంది. మీపై ఉన్న అభిమానంతో అధికారులు మీకు ప్రమోషన్స్ కల్పించవచ్చు. జీతం పెరిగే సూచనలు ఉన్నాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బహుమతులు అందుకుంటారు. ఆనందంగా గడుపుతారు.
మిథునం (Gemini) : ఈరోజు ఆందోళనకు గురవుతారు. దీంతో ఏ పనిమీద సరైన శ్రద్ధ చూపరు. నీరసం, నిరుత్సాహం మిమ్మల్ని ముందుకు సాగనివ్వవు. ఉదర సంబంధ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు చేస్తారు. వ్యాపారం ఆశాజనకంగా ఉండదు. సహోద్యుగుల నుంచి సహకారం అందదు. పైగా ఇబ్బందులకు గురిచేస్తారు. పిల్లల విషయాలు మీకు మరింత చికాకును కలిగిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం దొరకదు. ఆఫీసు వ్యవహారాల్లో అసంతృప్తికి లోనవుతారు.
కర్కాటకం (Cancer) : వ్యాపారులు ఈరోజు తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక నష్టాలు సంభవించే సూచనలున్నాయి. ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి. మిగిలిన వ్యవహారాల్లో మరింత జాగ్రత్తగా మెలగండి.
సింహం (Leo) : ఈరోజు మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. మీ బంగారు భవిష్యత్తుకు అవసరమైన డబ్బును పొందేందుకు తగిన అవకాశాలను మీరు ఈరోజు అన్వేషిస్తారు. సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆధ్యాత్మికతవైపు మీ మనస్సు మళ్లుతుంది. ధ్యానం, యోగా చేస్తారు.
కన్య (Virgo) : ఈరోజు మీరు పూర్తి భిన్నంగా ఉంటారు. మీ సృజనాత్మక నైపుణ్యాన్ని మీ వ్యక్తిగత జీవితంలో ప్రదర్శిస్తారు. అలాగే మీకు నచ్చిన రంగంలో ముందుకెళ్లి పేరుప్రతిష్ఠలు సంపాదించుకుంటారు. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలా..? వద్దా..? లేదా చదువు కొనసాగించాలా..? ఆపేయాలా..? అనేదానిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తుల (Libra) : మీ ఆకాంక్షలను నెరవేర్చుకునే సమయంలో నోటికి పనిచెప్తారు. అది తీవ్రస్థాయికి చేరితే గనుక మీ ఇమేజ్ దెబ్బతింటుందని గుర్తుంచుకోండి. పెద్ద విషయాలు, ఘర్షణలకు ఈరోజు దూరంగా ఉండటం మంచిది.
వృశ్చికం (Scorpio) : ఈరోజు దయను కలిగి ఉంటారు. నిష్కపటంగా, ఉదార స్వభావం కలిగి ఉండటం వలన కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. మీ భాగస్వామి చెప్పేది మీరు సానుకూలంగా వింటారు. ఇది వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
ధనుస్సు (Sagittarius) : ఈరోజు మీ మానసిక స్థితి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓర్పుతో ఉండండి. ఇది మీ గమ్యాన్ని చేరుకునేందుకు దోహదం చేస్తుంది. పనిప్రదేశంలో ఎవరితోనూ ఘర్షణలకు దిగకండి. లేదంటే అవి మీపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతాయి. ఈరోజు మీ భాగస్వామితో సన్నిహితంగా గడుపుతారు.
మకరం (Capricorn) : ఏదైనా తెలుసుకోవాలనే తపనను ఈరోజు మీరు కలిగి ఉంటారు. మీ ప్రత్యర్థులకు మీరే గట్టి పోటీ అని నిరూపించుకుంటారు. వారి ఆలోచనలను తలకిందులు చేస్తారు. ఇది మీకు ప్రయోజనకరంగా మారుతుంది. పరిస్థితులు అదుపు తప్పుతున్నప్పుడు మీ మేధా శక్తిని ఈరోజు మీరు రుజువు చేసుకుంటారు.
కుంభం (Aquarius) : ఈరోజు మీ తారాబలం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థికపరమైన పురోగతి ఇందుకు కారణం. శారీరకంగాను, మానసికంగానూ చాలా సంతోషంగా ఉంటారు. ఏదైనా ట్రిప్‌కు ప్లాన్ చేయండి. ఆధ్యాత్మికంగా గడపడం మీకు ఈరోజు ఎంతో హాయినిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలల ప్రపంచంలో విహరిస్తారు.
మీనం (Pisces) : మీరు ఏకాంతంగా ఉన్నప్పటికీ.. ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. మీ ఆత్మస్వరాన్ని ఈరోజు మీరు వినాలనుకుంటారు. మీ నిజమైన రూపాన్ని చూపించాలనుకుంటారు. మీ నిశ్శబ్దంలోనూ మీ మాటను వినగలిగే మీ ప్రియమైన వారితో సాయంత్రాన్ని గడపండి.