Horoscope Today 28th August 2023 : ఆగస్టు 28న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఈ రోజు ఫలవంతంగా గడుస్తుంది. మీరు పనులను సమయానికి పూర్తి చేస్తారు. ఈ రాశివారు అనవసరమైన వాదనలు, చర్చలకు దూరంగా ఉండడం మంచిది. కాదని విరుద్ధంగా వ్యవహరిస్తే పరిస్థితులు కఠినంగా మారుతాయి. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
వృషభం (Taurus) : ఈ రోజు మీరు అవిశ్రాంతంగా పనిచేస్తారు. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీ ఆలోచనలు కూడా తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఇవి మీ సంబంధాలను దెబ్బతీస్తాయి. కోపాన్ని, మాటలను నియంత్రణలో ఉంచుకోండి. పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త పనులను ప్రారంభించకపోవడం మేలు.
మిథునం (Gemini) : ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రోజు ప్రారంభంలో వినోదభరితంగా, సంతోషంగా గడుపుతారు. అనంతరం కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు.
కర్కాటకం (Cancer) : ఆఫీసులో ఏర్పడే అనుకూలమైన వాతావరణం మీ ఆలోచనలను మారుస్తుంది. పనివిషయంలో మీతో పోటీ పడే వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఇది మీకు ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది. మీ తల్లిగారి తరపు నుంచి శుభవార్త వింటారు. ఇది మీ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదభరితంగా మార్చేస్తుంది. శారీరక, మానసిక స్థితి అధ్బుతంగా ఉంటుంది.
సింహం (Leo) : ఈ రోజు మీరు ప్రేమను పొందుతారు. కానీ, మీ కోపాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే పరిస్థితులు మీకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అజీర్తి సమస్యలతో శారీరకంగా కొంత ఇబ్బంది పడతారు. సాయంత్రానికి పరిస్థితులు మెరుగవుతాయి.
కన్య (Virgo) : బద్ధకం, బలహీనత ఈ రోజు మీ వెంటే ఉంటాయి. ఆర్థికపరమైన ఖర్చులు ఉంటాయి. మీ చంచల మనస్తత్వం కారణంగా మీకు చెడ్డపేరు వస్తుంది. కనుక జాగ్రత్తగా మెలగండి. అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేయలేకపోవడం మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది.
తుల (Libra) : కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు ఈ రోజు మంచి రోజు. మీ బాల్య మిత్రులను కలుసుకుని సరదాగా గడిపేందుకు ఇదే సరైన సమయం. మీ కీర్తి ప్రతిష్ఠలు, గౌరవం పెరుగుతాయి. సాయంత్రానికి నిరుత్సాహపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇంట్లో గొవడవలు జరుగుతాయి. అమ్మగారి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.
వృశ్చికం (Scorpio) : ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంది. రోజు ప్రతికూలంగా మొదలై.. సానుకూలంగా ముగుస్తుంది. అన్ని రంగాల వారికి ఉదయం కఠినంగా ఉంటుంది. ప్రత్యేకంగా వృత్తి నిపుణులకు ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది. చెడు ఫలితాలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఓపికతో ఉండండి. సాయంత్రానికి పరిస్థితులు మెరుగవుతాయి. ఇంటి దగ్గర గొడవలు, అర్థంలేని వాదనలకు దూరంగా ఉండండి.
ధనుస్సు (Sagittarius) : ఈ రోజు మీపై లక్ష్మీ దేవి, గణేశుని కటాక్షం ఉంది. ఆర్థికపరంగా లాభాలు పొందుతారు. మీరు చేసే ప్రతిపనిలో విజయం సాధిస్తారు. సాయంత్రం దైవదర్శనం చేస్తారు. దేవుడి సన్నిధిలో ధ్యానం చేయడం మంచిది. ఆఫీసులో, ఇంట్లో కొన్ని సమస్యలు ఎదురైనా మొత్తంగా ఈ రోజు మీకు కలిసి వస్తుంది. అనవసరమైన ఖర్చులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి.
మకరం (Capricorn) : రోజు ప్రారంభంలో కొన్ని సవాళ్ళు మినహా ఆందోళన చెందాల్సిన పరిస్థితులు అంతగా లేవు. ముఖ్యంగా ఒక చట్టపరమైన వివాదంలో మీరు సాక్షిగా ఉంటే గనుక అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు నెమ్మదిగా వెళ్లండి. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కుంభం (Aquarius) : ఈ రోజు సామాజికంగా, ఆర్థికపరంగా అభివృద్ధి చెందుతారు. సాయంత్రానికి కాస్త గజిబిజికి లోనవుతారు. ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఇది మీ కుటుంబంలోని సామరస్యాన్ని, ప్రశాంతతను దెబ్బతీస్తుంది.
మీనం (Pisces) : ఈ రోజు సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. వృత్తిపరంగా పదోన్నతులు లభిస్తాయి. ఆర్థిక లాభాలు పొందుతారు. వ్యక్తిగతంగా పరిస్థితులు చాలా మధురంగా ఉంటాయి. సంతోషం, శాంతి, సంతృప్తి అనేవి ఈ రోజు మీ వెంటే ఉంటాయి.