Horoscope Today 26th August 2023 In Telugu : ఆగస్టు 26న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఈ రోజు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి మంచి రోజు. సమస్యలు ఇబ్బంది పెట్టనా మధ్యాహ్నం తర్వాత సమయం అనుకూలంగా ఉంది. పట్టుదలతో ఉండండి. మీ మాటతీరు, వ్యవహారశైలి వివాదాలకు దారితీస్తాయి. అందుకే మాటలు అదుపులో ఉంచుకోండి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ధ్యానం, యోగా చేయండి. మీరు పనిచేసే చోట ప్రతికూల వాతావరణం ఉంటుంది.
వృషభం (Taurus) : ఈ రోజు సాధారణంగా మొదలవుతుంది. అయినా సాయంత్రానికి పరిస్థితులు తారుమారవుతాయి. ఒక సమయంలో ఒత్తిడికి లోనవుతారు. మీ ప్రియమైన వారితో ఈ రోజు మీరు గడుపుతారు.
మిథునం (Gemini) : ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. మీ స్నేహితులను, ప్రియమైన వారిని కలుసుకుంటారు. ఆఫీసులో సంఘర్షణా వాతావరణం ఏర్పడుతుంది. మీ పాజిటివ్ ఎనర్జీ వల్ల మీరు అడుగు పెట్టిన ప్రతి చోటా విజయం సాధిస్తారు. సహోద్యోగులు సహకారం అందిస్తారు. ఇంటి వాతావరణం ఉల్లాసభరితంగా ఉంటుంది. వివిధ రకాల ఆహార పదార్థాలను ఈరోజు మీరు రుచి చూస్తారు.
కర్కాటకం (Cancer) : కొన్ని పరిస్థితులు ఈ రోజు ప్రారంభంలోనే మీకు కోపాన్ని కలిగిస్తాయి. రక్తపోటు పరీక్షలు చేయించుకుంటే మంచిది. పనిలో నిగ్రహాన్ని పాటించండి. దీంతో ఊహించని విధంగా లాభపడతారు. ధ్యానం చేయండి.
సింహం (Leo) : మానసిక ఆందోళనల నుంచి, వ్యాధి బాధల నుంచి, ఇబ్బంది పడే సంబంధాలనుంచి ఈ రోజు విముక్తి పొందుతారు. ఇందుకోసం అనుకూల దృక్పథంతో మెలగండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి. మీ ఉద్రేకాన్ని నియంత్రణలో ఉంచుకోండి. ఖర్చులు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. లేదంటే ఆర్థికంగా నష్టపోతారు. పెట్టుబడుల విషయంలో భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవడానికి ఈ రోజు మంచి రోజు. చర్చలకు, వాదనలకు దూరంగా ఉండండి.
కన్య (Virgo) : సాధారణ అలసటతో మీ ఈ రోజు ప్రారంభమవుతుంది. సాయంత్రానికి ఉత్సాహభరితంగా మారుతుంది. కానీ, ఓ సమస్య మీ తలుపు తడుతుంది. దీంతో మీరు ఒత్తిడికి గురవుతారు. మీకు నచ్చిన వారితో గడపండి బాధలన్నీ మర్చిపోతారు.
తుల (Libra) : అనవసర విషయాలు ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఎవరితోనైతే విభేదాలు ఉంటాయో వారికి దూరంగా ఉండటం మంచిది. దీంతో సమస్యలు కూడా తొలిగిపోతాయి. వ్యాపారపరంగా వివిధ మార్గాల ద్వారా మీకు డబ్బు అందుతుంది.
వృశ్చికం (Scorpio) : ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ప్రతిఫలం పొందుతారు. కుటుంబ సభ్యుల్లో జరుగుతున్న అనవసర చర్చలకు ముగింపు పలుకుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసర ఖర్చులకు పోవద్దు. విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా లేదు.
ధనుస్సు (Sagittarius) : మీ తారాబల ప్రభావంతో ఉదయం మీరు పడిన ఇబ్బందులన్నీ సాయంత్రానికి ఆనందకరంగా పరిణమిస్తాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు నెమ్మదిని పాటించండి. లేదంటే ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి. ఖర్చులున్నాయి జాగ్రత్త. మీరు చేసే ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. ఇంట్లోని వాతావరణం మీకు ప్రతికూలంగా మారుతుంది. ఓపికతో మెలగండి. ఒక సమయంలో అన్నీ సద్దుమణుగుతాయి. రోజు గడుస్తున్న కొద్దీ మీ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. వ్యక్తిగతంగా సంతృప్తిగా, ఆనందంగా ఉంటారు.
మకరం (Capricorn) : ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు ఫలప్రదమైన రోజు. ఇంట్లో వాతావరణం ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఒక సమస్య కారణంగా మధ్యాహ్నానికి మీ ఆనంద క్షణాలకు బ్రేక్ పడుతుంది. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో మెలగండి. లేదంటే వివాదాలు తప్పవు. ఖర్చులను అదుపులో ఉంచండి. అవమానానికి గురయ్యే పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చుకోకండి.
కుంభం (Aquarius) : ఈ రాశిలోని అన్ని రంగాలవారికి ఈ రోజు తారాబలం అనుకూలంగా ఉంది. ప్రమోషన్స్, జీతంలో పెంపుదలకు అవకాశాలున్నాయి. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. మీ స్నేహితులతో ఆహ్లాదకర ప్రదేశాలకు వెళ్లండి. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. మీ పిల్లలు సాధించే అభివృద్ధిని చూసి మరింత ఆనందాన్ని పొందుతారు.
మీనం (Pisces) : మీ సృజనాత్మకతను, విశ్లేషణాత్మక నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఈ రోజు మంచి రోజు. క్రియేటివ్ రైటింగ్, చర్చల్లో పాల్గొనండి. ఏ విషయంలోనైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఈ రోజు అనుకూలమైన రోజు. కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఫలిస్తుంది. ఆర్థికంగా లబ్ధి పొందుతారు. శారీరకంగా మీ ఫిట్నెస్ తగ్గుతుంది. అయినా ఇంట్లోని ప్రేమపూర్వక వాతావరణం కారణంగా త్వరగానే కోలుకుంటారు. విదేశాల నుంచి శుభవార్త వింటారు.