Horoscope Today 25th August 2023 In Telugu : ఆగస్టు 25న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఈ రోజు మీరు కొంత వింత అనుభూతికి లోనవుతారు. అధ్యాత్మ పరంగా వృద్ధి చెందుతారు. గర్వం, అహాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రయాణాలు చేసేందుకు ఇది మంచి సమయం కాదు.
వృషభం (Taurus) : మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తి మీకు ఈ రోజు ఎదురుపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ సహజ స్వభావాన్ని వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించకండి. ప్రశాంతంగా, స్థిరంగా ఉండండి. మీ స్వభావానికి తగ్గట్లు ప్రవర్తించండి. మీ మంచితనానికి, ప్రశాంతతకు భంగం కలిగించే అవకాశం ఇతరులకు ఇవ్వకండి.
మిథునం (Gemini) : ఉద్యోగం కంటే కూడా ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. జిమ్లో వ్యాయామం చేసేందుకు కాస్త సమయం కేటాయిస్తారు. ప్రమోషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు లాభదాయకంగా ఉంది.
కర్కాటకం (Cancer) : ఈ రోజు సరదాగా, ఆనందంగా గడుపుతారు. రోజు గడుస్తున్న కొద్దీ నిబద్ధతతో మీ పనిపై దృష్టిని కేంద్రీకరిస్తారు.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలకు దిగుతారు. శారీరికంగా, మానసికంగా ఇబ్బంది పడతారు. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. మీ తల్లిగారు అనారోగ్యం బారిన పడొచ్చు. ఒత్తిళ్లు ఉంటాయి. ఇది మీ నిద్రను పాడు చేస్తుంది. జలాశయాలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.
కన్య (Virgo) : శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటారు. మీరు చేసే పనిలో నిమగ్నమవుతారు. మీ ప్రియమైన వారితో కాలక్షేపం చేస్తారు. ఇతరుల నుంచి సహకారం అందుతుంది. మీ ఆధ్యాత్మ సంబంధమైన ఙ్ఞానానికి తగిన గుర్తింపు దొరుకుతుంది.
తుల (Libra) : ఈ రోజు గందరగోళంగా గడుపుతారు. అనిశ్చితి మిమ్మల్ని ఇంకా వేధిస్తుంటుంది. సహనాన్ని కలిగి ఉండండి. బాధ్యత కలిగిన వ్యక్తిలా ప్రవర్తించండి. జీవితం, వ్యక్తులు సహా ఇతర విషయాల పట్ల మీరు సర్దుకుపోయే స్వభావం మీకు ఓ వరంలా పనిచేస్తుంది.
వృశ్చికం (Scorpio) : ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులు, ఫ్యామిలీ నుంచి బహుమతులు అందుకుంటారు. ప్రియమైన వారిని కలుసుకుంటారు. ప్రయాణం ఆనందాన్ని కలిగిస్తాయి. శుభవార్త వింటారు.
ధనుస్సు (Sagittarius) : మీ మాటలను నియంత్రణలో పెట్టుకోండి. లేందటే సమస్యల్లో చిక్కుకుంటారు. మాటతీరును మార్చుకునే ప్రయత్నం చేయండి లేని పక్షంలో రోజంతా వాదనలు, సంజాయిషీలతో గడపాల్సి ఉంటుంది. మానసికంగా ఇబ్బంది పడతారు.
మకరం (Capricorn) : ఈ రోజు చాలా అద్భుతంగా గడుస్తుంది. మీరు స్నేహితులతో, ఇష్టమైన బంధువులతో సమావేశమవుతారు. వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడాలనే ఆలోచనలో ఉన్నవారికి ఈ రోజు శుభదాయకం. స్నేహితుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతిని పొందుతారు.
కుంభం (Aquarius) : ఈ రోజు అనుకూలంగా ఉంది. శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వృత్తిపరంగా కూడా చక్కగా రాణిస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఇది మీలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. మీ సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. మీ పనికి తగ్గ గుర్తింపును పొందుతారు.
మీనం (Pisces) : ఈరోజు మీ మనసే మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. నిర్ణయాలు తీసుకునే విషయాల్లో వెనకబడతారు. దీనికి మీ నీరసం కూడా ఒక కారణం కావచ్చు. మీ ఆలోచనలు, గొణుగుడులు మీతో పాటు మీ చుట్టూ ఉన్న వారికి అలసటను తెప్పిస్తాయి. పనిప్రదేశంలో మీ సహచరులతో మెలిగేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉంటే మంచిది.