ETV Bharat / bharat

'ఆ పార్టీది హడావుడే.. డిపాజిట్లు కూడా కష్టం!'

గుజరాత్​లో భాజపాకు ఆమ్​ఆద్మీ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా అవతరించిందన్న వాదనల్ని జేపీ నడ్డా తోసిపుచ్చారు. గతంలోనూ అనేక రాష్ట్రాల్లో ఆప్​ ఇలానే హడావుడి చేసిందని, కనీసం డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఉచిత హామీలపై చర్చ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా.

JP Nadda on freebies
జేపీ నడ్డా
author img

By

Published : Nov 6, 2022, 7:15 PM IST

ఈటీవీ భారత్​తో మాట్లాడుతున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

Himachal Pradesh BJP Manifesto : సంక్షేమ పథకాలతో ప్రజల్ని సాధికారుల్ని చేయడానికి, ఉచిత హామీలతో ప్రలోభాలకు గురిచేయడానికి మధ్య సన్నటి గీత ఉందని వ్యాఖ్యానించారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. రాజకీయ పార్టీల ఉచిత హామీలపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అన్ని వర్గాల సాధికారత కోసమే పని చేస్తుందని స్పష్టం చేశారు. ఈసీ ప్రకటనతో సంబంధం లేకుండా.. 365 రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు భాజపా సిద్ధంగా ఉంటుందని చెప్పారు నడ్డా. హిమాచల్ ప్రదేశ్​ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా శిమ్లా వచ్చిన జేపీ నడ్డా.. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

"సాధికారత, ప్రలోభపెట్టడానికి మధ్య తేడా ఉంది. అవసరం లేనిది కూడా ఇస్తే.. అది ప్రలోభం. కానీ.. ప్రజల జీవితాన్నే మార్చే వన్​ టైమ్​ ఇన్వెస్ట్​మెంట్​లాంటిది ఏదైనా ఇస్తే.. అది సాధికారత. మేము సాధికారత దిశగానే ముందుకు సాగుతాం. మేము ప్రధానంగా మహిళా సాధికారతపై దృష్టిపెట్టాం. ఎందుకంటే.. మహిళల సాధికారత సాధిస్తే కుటుంబం మొత్తం లాభపడుతుంది. జనాభాలో సగం మహిళలే. అలానే.. వ్యవసాయం చేసేవారినీ మేము సాధికారుల్ని చేశాం" అని చెప్పారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా.

హిమాచల్​ప్రదేశ్​లో ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగుతుందన్న కాంగ్రెస్​ అంచనాలపై తనదైన శైలిలో స్పందించారు నడ్డా. "మేము ఇప్పటికే సంప్రదాయాన్ని మార్చేశాం. ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, మణిపుర్​లో ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం మార్చేశాం." అని అన్నారు.

గుజరాత్​లో భాజపాకు ఆమ్​ఆద్మీ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా అవతరించిందన్న వాదనల్ని నడ్డా తోసిపుచ్చారు. "మా పోరాటం కాంగ్రెస్​తోనే. ఫలితాలు మీరే చూస్తారు. ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవా.. ఇలా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ పార్టీ(ఆప్​) వచ్చి హడావుడి చేస్తుంది. కానీ.. వారికి డిపాజిట్లు కూడా రావు" అని ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి: ఉపఎన్నికల్లో సత్తా చాటిన భాజపా.. పట్టు నిలుపుకున్న ఆర్జేడీ, శివసేన

ఉమ్మడి పౌర స్మృతి అమలు.. అమ్మాయిలకు సైకిళ్లు, స్కూటర్లు, రిజర్వేషన్.. భాజపా హామీల జల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.