ETV Bharat / bharat

మేనకా గాంధీకి 'పీటర్‌ సింగర్‌ ప్రైజ్‌' - maneka gandhi

జంతు హక్కుల కోసం పోరాడే ఎంపీ మేనక గాంధీని పీటర్ సింగర్​ ప్రైజ్ వరిచింది. ఈ విషయాన్ని ట్విట్టర్​లో పంచుకున్న ఆమె కుమారుడు వరుణ్‌ గాంధీ.. తల్లికి శుభాకాంక్షలు తెలిపారు.

maneka gandhi
మేనకా గాంధీ
author img

By

Published : Jun 1, 2021, 5:23 AM IST

ఎంపీగా, జంతువుల హక్కుల కోసం పోరాడుతున్న సమాజ సేవకురాలిగా దేశవ్యాప్త గుర్తింపును సొంతం చేసుకున్న మేనకా గాంధీకి 'పీటర్‌ సింగర్‌ ప్రైజ్‌' వచ్చింది. ఈ విషయాన్ని ఆమె తనయుడు, ఫిలిబిత్‌ ఎంపీ వరుణ్‌ గాంధీ ట్విటర్‌లో వెల్లడించారు. జంతు సంరక్షణ కోసం చాలా ఏళ్లుగా కృషి చేస్తున్న తన తల్లికి ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. జీవితంలో జంతువుల సంరక్షణకే అధిక ప్రాధాన్యమిచ్చిన తన తల్లి కన్నా ఈ ప్రైజ్‌ పొందడానికి అర్హులుగా మరొకరిని ఊహించుకోలేనంటూ ఆ పోస్టులో వ్యాఖ్యానించారు.

maneka gandhi
మేనకా గాంధీ, రిచర్డ్‌ రైడర్‌లకు 'పీటర్‌ సింగర్‌ ప్రైజ్‌'

జంతువుల సంరక్షణ, వాటి హక్కులను కాపాడేందుకు కృషి చేసిన వారికి పీటర్‌ సింగర్‌ ప్రైజ్‌ అందజేస్తుంటారు. ఆరో పీటర్‌ సింగర్‌ ప్రైజ్‌ను మేనకా గాంధీ, ఏడో ప్రైజ్‌ను రిచర్డ్‌ రైడర్‌ అనే మరో జంతు ప్రేమికుడు అందుకోనున్నారు. జంతు హక్కుల పరిరక్షణ కార్యకర్త, తత్వవేత్తగా ఆస్ట్రేలియాకు చెందిన పీటర్‌ సింగర్‌ సుప్రసిద్ధుడు. జంతువుల హక్కుల కోసం ఉద్యమించిన వారిలో ఆయన అగ్రగామి. 1975లో ఆయన రాసిన 'యానిమల్‌ లిబరేషన్‌' పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 20 భాషల్లోకి అనువాదం అయింది. ఆధునిక కాలంలో జంతు హక్కుల పరిరక్షణ ఉద్యమానికి ఈ పుస్తకం స్ఫూర్తిగా నిలిచింది.

ఇదీ చూడండి: అలా ఎలా చంపేస్తారు?: దిశ ఎన్​కౌంటర్​పై మేనక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.