Haryana Bulldozer Action : హరియాణాలోని నూహ్ జిల్లాలో ఘర్షణల అనంతరం అక్రమ నిర్మాణాలపై స్థానిక అధికార యంత్రాంగం.. ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే అల్లర్లకు పాల్పడిన వారికి చెందిన నిర్మాణాలు అక్రమమంటూ బుల్డోజర్లతో కూల్చివేయించింది. తాజాగా రజా సహారా హోటల్‌ను కూల్చివేశారు. ఇటీవల ఘర్షణల సమయంలో దుండగులు అక్కడి నుంచే రాళ్లు విసిరారని జిల్లా యంత్రాంగం తెలిపింది. అది అక్రమంగా నిర్మించారని వెల్లడించింది.
-
#WATCH | Haryana | A hotel-cum-restaurant demolished in Nuh. District administration says that it was built illegally and hooligans had pelted stones from here during the recent violence. https://t.co/XcWkdHQ2jM pic.twitter.com/YmjDiG1fuY
— ANI (@ANI) August 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Haryana | A hotel-cum-restaurant demolished in Nuh. District administration says that it was built illegally and hooligans had pelted stones from here during the recent violence. https://t.co/XcWkdHQ2jM pic.twitter.com/YmjDiG1fuY
— ANI (@ANI) August 6, 2023#WATCH | Haryana | A hotel-cum-restaurant demolished in Nuh. District administration says that it was built illegally and hooligans had pelted stones from here during the recent violence. https://t.co/XcWkdHQ2jM pic.twitter.com/YmjDiG1fuY
— ANI (@ANI) August 6, 2023
'మహాపంచాయత్ ప్రశాంతంగా..'
Nuh Violence Update : అదే సమయంలో గురుగ్రామ్ సమీపంలోని టిఘర్ గ్రామంలో హిందూ సమాజ్ ఆధ్వర్యంలో మహాపంచాయత్ జరుగుతున్న నేపథ్యంలో.. పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. రెండు, మూడు రోజుల నుంచి గురుగ్రామ్ ప్రశాంతంగా ఉందన్న ఏసీపీ వికాస్ కౌశిక్.. మహాపంచాయత్ కూడా ప్రశాంతంగా సాగుతుందని భావిస్తున్నట్లు వివరించారు.
ఆగస్ట్ 8వ తేదీ వరకు నో ఇంటర్నెట్..
Nuh Internet Ban : నూహ్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఆగస్టు 8వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే ఈ ప్రాంతంలో పనిచేస్తాయని అధికారులు తెలిపారు. దీంతోపాటు విద్వేషాలను వ్యాప్తి చేస్తున్న 200 సోషల్ మీడియా పోస్టులను అధికారులు తొలగించారు. నాలుగు ఖాతాలను మూసివేయించారు. మరో 16 ఖాతాలను సస్పెండ్ చేశారు.
కర్ఫ్యూ ఎత్తివేత
Haryana Nuh Curfew : మరోవైపు, నూహ్‌లో ఆదివారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ తాత్కాలికంగా ఎత్తివేశారు. దీంతో ప్రజలు.. కూరగాయలు, మందులు కొనుగోలు చేసేందుకు రోడ్లపైకి వచ్చారు. నూహ్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు.. మూడు గంటలపాటు కర్ఫ్యూ ఎత్తివేశామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత యథాతథంగా కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు.
-
#WATCH | Haryana | Curfew in Nuh lifted for the movement of public from 9 am to 12 noon (3 hours only) today.
— ANI (@ANI) August 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
People step out of their houses to purchase vegetables and other medicines. Visuals from Nuh Sabzi Mandi. pic.twitter.com/giwCz4BUov
">#WATCH | Haryana | Curfew in Nuh lifted for the movement of public from 9 am to 12 noon (3 hours only) today.
— ANI (@ANI) August 6, 2023
People step out of their houses to purchase vegetables and other medicines. Visuals from Nuh Sabzi Mandi. pic.twitter.com/giwCz4BUov#WATCH | Haryana | Curfew in Nuh lifted for the movement of public from 9 am to 12 noon (3 hours only) today.
— ANI (@ANI) August 6, 2023
People step out of their houses to purchase vegetables and other medicines. Visuals from Nuh Sabzi Mandi. pic.twitter.com/giwCz4BUov
'పరారీలో యజమానులు..'
Haryana Nuh Bulldozer : ఇటీవల అల్లర్లలో పాల్గొన్న వారివిగా చెబుతున్న దుకాణాలను తాము కూల్చామని అధికారులు చెబుతున్నారు. వీటి యజమానులు ఇప్పటికే అరెస్టులకు భయపడి పరారీలో ఉన్నట్లు తెలిపారు. నూహ్‌లో కొన్నేళ్ల నుంచి ఉన్న అక్రమ నిర్మాణాలను గత మూడు రోజుల నుంచి అధికారులు.. బుల్డోజర్తో కూలుస్తున్నారు.
ఆరుకు చేరిన హరియాణా ఘర్షణ మృతుల సంఖ్య.. దిల్లీ పోలీసులు అలర్ట్
'నిరసనల్లో విద్వేష ప్రసంగాలు జరగకుండా చూడండి'.. హరియాణా హింసపై కేంద్రానికి సుప్రీం ఆదేశం