ETV Bharat / bharat

కమల్​ డిశ్ఛార్జ్- ఎన్నికల ప్రచారం ఇప్పట్లో కష్టమే! - ప్రముఖ సినీనటుడు, మక్కల్​ నీది మయ్యమ్​ పార్టీ అధ్యక్షుడు కమల్​ హాసన్

ప్రముఖ సినీనటుడు, మక్కల్​ నీది మయ్యమ్​ పార్టీ అధ్యక్షుడు కమల్​ హాసన్​.. ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్​ అయ్యారు. అయితేే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాతే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడతారని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.

Haasan discharged following surgery
ఆసుపత్రి నుంచి కమల్​ డిశ్ఛార్జి
author img

By

Published : Jan 22, 2021, 7:14 PM IST

మక్కల్​ నీది మయ్యమ్​ పార్టీ అధ్యక్షుడు కమల్​ హాసన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. అయితేే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాతే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడతారని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.

గతంలో కమల్​ హాసన్ ఓ ప్రమాదానికి గురికాగా... ఆయన​ కాలుకు శస్త్రచికిత్స జరిగింది. అదే చోట ఇన్​ఫెక్షన్​​ సోకడం వల్ల కొద్దిరోజుల క్రితం చెన్నైలోని శ్రీ రామచంద్ర ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు.. జనవరి 19న ఆయన కుడికాలుకు శస్త్రచికిత్సచేసి ఇన్​ఫెక్షన్​ సోకిన కణజాలాన్ని తొలగించారు.

ఏప్రిల్​-మేలో తమిళనాడులో జరగునున్న శాసన సభ ఎన్నికల కోసం డిసెంబర్​లోనే ప్రచారం మొదలుపెట్టారు కమల్.

ఇదీ చూడండి: సీడబ్ల్యూసీ భేటీలో నేతల మధ్య వాగ్యుద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.