ETV Bharat / bharat

బస్సును ఢీకొట్టిన డంపర్- 13మంది సజీవదహనం - బస్సును ఢీకొట్టిన డంపర్

Guna Bus Accident : డంపర్​ ఢీకొనడం వల్ల ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి 13 మంది సజీవ దహనమమ్యారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్​లోని గుణ జిల్లాలో జరిగింది.

Guna Bus Accident
Guna Bus Accident
author img

By PTI

Published : Dec 28, 2023, 6:39 AM IST

Updated : Dec 28, 2023, 11:14 AM IST

Guna Bus Accident : మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13మంది సజీవ దహనమయ్యారు. మరో 13మందికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న డంపర్‌ ట్రక్కు ఢీకొనడం వల్ల ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను గుణ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. గుణ-ఆరోన్ రహదారిపై రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

Madhya Pradesh Bus Accident : మృతుల వివరాలను ధ్రువీకరించిన జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ ఖత్రి, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. అందులో నుంచి నలుగురు ప్రయాణికులు ఎలాగోలా బయటపడ్డారని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని గుణ జిల్లా కలెక్టర్ తరుణ్​ రాఠీ తెలిపారు.

మధ్యప్రదేశ్​ ఘోర రోడ్డు ప్రమాదం

ముఖ్యమంత్రి విచారం
ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు. దీంతోపాటు ఈ దుర్ఘటనపై విచారణకు ఆదేశించారు. మరోవైపు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ ప్రమాదంపై స్పందించారు. సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ ఎక్స్​ వేదికగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటన బాధకరమైనదిగా పేర్కొన్న సింధియా, దీని గురించి సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్​, ఎస్పీతో మాట్లాడినట్లు తెలిపారు. సహాయక చర్యలు ప్రారంభించాలని ఆదేశించినట్లు వెల్లడించారు.

  • गुना से आरोन जा रही बस में भीषण आग से यात्रियों के हताहत होने का समाचार अत्यंत दुःखद है।

    इस हृदय विदारक दुर्घटना में असमय मृत्यु को प्राप्त हुए दिवंगतों के परिजनों के साथ मेरी संवेदनाएं हैं। दुःख की इस विकट परिस्थिति में प्रदेश सरकार पीड़ित परिवारों के साथ खड़ी है।

    मैंने…

    — Dr Mohan Yadav (@DrMohanYadav51) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • गुना आरोन रोड पर यात्री बस में आग लगने की खबर दुखदायी है। घटना की खबर मिलते ही गुना कलेक्टर से दूरभाष पर चर्चा कर शीघ्र राहत एवं बचाव कार्य शुरू करने के निर्देश दिये।

    ईश्वर इस हादसे में दिवंगत हुए नागरिकों की आत्मा को शांति और उनके परिजनों को ये आघात सहने की शक्ति प्रदान करे।…

    — Jyotiraditya M. Scindia (@JM_Scindia) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Road Accident in Jammu : ఈ ఏడాది నవంబర్​లో ఓ బస్సు అదుపు తప్పి 300 అడుగుల లోతు లోయలో పడిపోవడం వల్ల 38 మంది చనిపోయారు. మరో 19 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జమ్ముకశ్మీర్​లోని​ డోడా జిల్లాలోని బాటోటె-కిష్ట్వార్​ జాతీయ రహదారిపై జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

24 మంది మృతులకు ఒకేచోట అంత్యక్రియలు.. డీఎన్​ఏ పరీక్ష ఆలస్యమవుతుందని..

నల్గొండలో బస్సు దగ్ధం - ఒకరు సజీవదహనం - 38 మందికి!

Last Updated : Dec 28, 2023, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.