ETV Bharat / bharat

గుజరాత్​ స్థానిక సమరం: ఓటు వేయనున్న 3.4 కోట్ల మంది

గుజరాత్​లో నేడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. 3.04 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 8,473 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Gujarat local bodies polls
గుజరాత్​లో నేడు స్థానిక పోరు- ఓటు వేయనున్న 3.4 కోట్ల మంది
author img

By

Published : Feb 28, 2021, 5:22 AM IST

గుజరాత్​లో స్థానిక పోరుకు రంగం సిద్ధమైంది. నేడు (ఆదివారం) రాష్ట్రంలోని 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మార్చి 2న చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్​ తెలిపింది.

మొత్తం 8,473 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీల్లో 680 వార్డులకు గాను 2,720 స్థానాలు, జిల్లా పంచాయతీల్లో 980 స్థానాలు, తాలుకా పంచాయతీల్లో 4,773 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. 3.04 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 36,008 బూత్​ల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. 44,000 మంది పోలీసు సిబ్బంది సహా, 12 సీఏపీఎఫ్​ కంపెనీలు, 54,000 మంది హోమ్​గార్డులు.. భద్రతా విధుల్లో పాల్గొనున్నారు.

ఈ ఎన్నికల్లో మరోమారు సత్తాచాటాలని భాజపా ఊవిళ్లూరుతుండగా.. కాంగ్రెస్​, ఆమ్​ ఆద్మీ పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి.

దిల్లీలో ఉప ఎన్నికలు..

దిల్లీలో ఐదు మున్సిపల్​ వార్డులకు ఆదివారం ఉపఎన్నికలు జరగనున్నాయి. రోహిణీ-సీ, శాలిమార్​ బాగ్​, త్రిలోక్​పురి, కల్యాణ్​పురి, చౌహాన్​ బంగర్​ మున్సిపల్​ వార్డులకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.

ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు.. 2.42 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్​ తెలిపింది.

మార్చి 3న ఫలితాలు ప్రకటించనున్నారు. 26 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. 327 పోలింగ్​ కేంద్రాలు ఎన్నికలను నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:ప్రధాని సొంతూరిలో స్థానిక​ సమరానికి సై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.