ETV Bharat / bharat

'భాజపాతోనే గుజరాత్​ ప్రజలు-స్థానిక ఫలితాలే నిదర్శనం' - గుజరాత్​ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా విజయం

గుజరాత్​లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ ఢాంకా మోగించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. గుజరాతీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

BJP
'ఈ విజయం భాజపా చేసిన అభివృద్ధికి నిదర్శనం'
author img

By

Published : Mar 2, 2021, 8:32 PM IST

గుజరాత్​లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా విజయదుందుభి మోగించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భాజపా చేసిన అభివృద్ధి, సుపరిపాలనకు గుజరాత్​ ప్రజలు మరోమారు పట్టం కట్టారని అభిప్రాయపడ్డారు. భాజపాకు అఖండ విజయం అందించిన ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నాని ట్వీట్​ చేశారు.

"గుజరాత్​లో నగర పాలక, తాలూక పంచాయతీ​, జిల్లా పంచాయతీ ఎన్నికలు.. భాజపా అభివృద్ధి, సుపరిపాలన అజెండాతోనే రాష్ట్ర ప్రజలు ఉన్నారని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. భాజపా పట్ల తిరుగులేని విశ్వాసం, బంధాన్ని కలిగి ఉన్నందుకు గుజరాత్​ ప్రజలకు నమస్కరిస్తున్నా."

-నరేంద్ర మోదీ, ప్రధాని

గుజరాత్​ నగర పాలక ఎన్నికల్లో పార్టీలు గెలుచుకున్న సీట్లు

భాజపా- 1,967

కాంగ్రెస్​-356

ఆప్​- 09

మొత్తం 31జిల్లా పంచాయతీ ఎన్నికల్లో 980 స్థానాలకు పార్టీలు గెలుచుకున్నవి

భాజపా- 735

కాంగ్రెస్​-157

ఆప్​-02

31జిల్లాలో పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలు, 81మున్సిపాలిటీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. 23మున్సిపాలిటీలకు ఉపఎన్నికలు జరిగాయి. తాలుకా పంచాయతీలలో 66.84శాతం పోలింగ్​ నమోదయింది.

ఇదీ చూడండి: గుజరాత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు, సీఎల్పీ నేతల రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.