గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో జరిగిన గ్యాస్ పేలుడులో ఇద్దరు మృతి చెందారని, మరో వ్యక్తి గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. కలోల్ పట్టణం పంచవటి ప్రాంతంలోని పోష్ సోసైటీలో ఓ ఇంట్లో గ్యాస్ లీకై పేలుడు సంభవించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పేలుడు ధాటికి అక్కడున్న రెండిల్లు పూర్తిగా దగ్ధమయ్యాయని పోలీసులు తెలిపారు.
పేలుడు సంభవించిన ప్రాంతం నుంచి ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ, గుజరాత్ గ్యాస్ లిమిటెడ్‌కు సంబంధించిన పైపులు వెళుతున్నాయని గాంధీ నగర్ ఎస్పీ తెలిపారు. పేలుడు జరగడం దురదృష్టకరమని ఓఎన్జీసీ పేర్కొంది. ఈ ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని తెలిపింది.
ఇదీ చూడండి: పిండివంటలు చేస్తుండగా గ్యాస్ లీక్.. నలుగురికి గాయాలు