ETV Bharat / bharat

తెల్లవారితే పెళ్లి- ప్రేయసితో వరుడు పరార్ - యూపీ వార్తలు

తెల్లవారితే పెళ్లి అనగా తన ప్రియురాలితో పరారయ్యాడు ఓ కొత్త పెళ్లి కొడుకు. అదీ కూడా కాబోయే అత్తింటివారు పెట్టిన బైకు, నగదుతో. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని పీలీభీత్​లో జరిగింది.

groom along with the cash escaped with the girlfriend in pilibhit
ప్రేయసితో వరుడు పరార్
author img

By

Published : May 25, 2021, 5:38 PM IST

పెళ్లి ఇష్టం లేని ఓ కొత్త పెళ్లి కొడుకు తెల్లవారితే వివాహం అనగా ప్రేయసితో పారిపోయాడు. ఇలాంటి సంఘటనలు చాలా చూశాం అనుకుంటున్నారా? అయితే.. ఈ నవ వరుడు.. మరో అడుగు ముందు కేసి అత్తింటివారు ఇచ్చిన నగదు, ద్విచక్రవాహనంతోనే పరారయ్యాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని పీలీభీత్ జిల్లాలో విచిత్ర సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫు బంధువులు.. వరుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు.

ఏం జరిగిందంటే..

బిల్సండా పోలీస్ స్టేషన్​ పరిధికి చెందిన ఓ యువతిని షాజహాన్​పుర్​లోని చంద్వాపుర్​కు చెందిన రామ్​స్వరూప్​ అనే యువకుడితో వివాహం చేయాలని నిశ్చయించారు. అమ్మాయి తండ్రి అదివరకే చనిపోయారు. దీంతో ఆమె తల్లే పెళ్లి తంతు జరిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మే 23న.. సింధూరం కార్యక్రమానికి అమ్మాయి బంధువులు చంద్వాపుర్​ వచ్చారు. అబ్బాయికి ఓ బైకు, రూ.51 వేల నగదు సహా మొత్తం రూ.2 లక్షల విలువైన సామగ్రి పెట్టారు. అనంతరం తిరుగు పయనమై.. మే 24న జరగాల్సిన కల్యాణ కార్యక్రమాలు చేపట్టారు.

groom along with the cash escaped with the girlfriend in pilibhit
పెళ్లికి చేసిన ఏర్పాట్లు

అప్పుడే వారికో షాకింగ్ వార్త తెలిసింది. మోటారు సైకిల్, రూ.20 వేల నగదు తీసుకొని వరుడు తన ప్రియురాలితో పారిపోయాడని విన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన వధువు బంధువులు, స్థానికులు.. పెళ్లి కొడుకు ఇంటికొచ్చి గొడవకు దిగారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: 51 మొక్కలే వరకట్నం- ఎందరికో ఆదర్శం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.