ప్రపంచంలోనే అతి పెద్ద చిత్రనగరిగా(Ramoji film city Reopen) గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన రామోజీ ఫిల్మ్ సిటీలో(ramoji film city latest news) రంగుల వినోదాలు ప్రారంభమయ్యాయి. కరోనా(Corona virus) పరిస్థితుల తర్వాత సకుటుంబ సమేతంగా ఆనందంగా గడిపేందుకు అవకాశం కల్పిస్తోంది. ఫిల్మ్ సిటీ(ramoji film city) తెరుచుకున్న తొలిరోజే వేలాది మంది తరలివచ్చి కేరింతలు కొట్టారు. చిత్రనగరిలో అడుగుపెట్టిన వారి కోసం నిర్వహించిన స్వాగత వేడుక పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేసింది.
![Ramoji film city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13298729_rfc.jpg)
అదిరే కొరియాగ్రఫీతో లైవ్ డాన్స్‌లు, 'యాక్షన్ ప్యాక్డ్ వైల్డ్ వెస్ట్ స్టంట్ షో'లతో కళాకారులు వారెవా అనిపించారు. ఆన్ స్టేజ్ లైవ్ పెర్ఫామెన్స్‌కు యానిమేషన్ కలిపి చేసే బ్లాక్ లైట్ షో మరో హైలైట్‌గా నిలిచాయి. ఫిల్మ్ సిటీలోని ఎక్స్‌క్లూజీవ్ జోన్లు పిల్లలను విశేషంగా అలరిస్తున్నాయి. భారీ సైజులో ఉండే బోర్డుపై స్నేక్స్ అండ్ లాడర్ గేమ్ ఆడటం సరికొత్త అనుభూతినిస్తుంది. పచ్చని పందిరి కింద ఉన్న బర్డ్ పార్క్ వివిధ ఖండాలకు చెందిన పక్షులు.. అన్యదేశ జాతులు, రంగులు కలిగిన అద్భుతమైన బటర్ ఫ్లై పార్కును సందర్శించి పర్యాటకులు మైమర్చిపోతున్నారు.
![Ramoji film city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13298729_kids-park-gallery-5.jpg)
వింటేజ్ బస్సుల్లో ప్రయాణిస్తూ రోజంతా అద్భుత ఫాంటసీ ప్రపంచాన్ని ఆస్వాదిస్తున్నారు. సినిమా సెట్టింగ్‌లు, సుందరమైన ఉద్యానవనాలు, మనసును ఆహ్లాదపరిచే లొకేషన్లను వీక్షిస్తూ.. మైమర్చిపోతున్నారు. రాజుల కాలాన్ని తలపించే కోటలు, మొగలుల వైభవం, మౌర్యులు శౌర్యాన్ని ప్రతిబింబించే నిర్మాణాలకు మంత్రముగ్ధులవుతున్నారు.
![Ramoji film city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13298729_kids-park-gallery-3.jpg)
చలనచిత్ర చరిత్రలో అద్భుత రికార్డులు సృష్టించిన బాహుబలి(bahubali set design) అనుభూతిని ప్రత్యక్షంగా పొందే అవకాశం రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శనతో పొందుతున్నారు. మాహిష్మతీ సామ్రాజ్యంలోని సుందర రాజప్రసాదాలు, అద్భుత ఆలయాల మధ్య సరదాగా విహరిస్తున్నారు.
![Ramoji film city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13298729_studio-tour-gallery-5.jpg)
![Ramoji film city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13298729_trfc.jpg)
ఇదీ చూడండి: రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణలు పునఃప్రారంభం