కరోనా వైరస్ ఆనవాళ్లను నిర్ధరించేందుకు వినియోగిస్తున్న ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కిట్ల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. దేశంలో థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందంటూ పలువురు నిపుణులు హెచ్చరిస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్- 19 యాంటీజెన్ టెస్టింగ్ కిట్‌లను ఎగుమతులపై ఆంక్షల కేటగిరీలో ఉంచుతున్నామని, తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఆంక్షల కేటగిరీలో ఉంచిన వస్తువులను ఎగుమతి చేయాలంటే ఎగుమతిదారులు డీజీఎఫ్‌టీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. రాబోయే కాలంలో మన దేశంలో థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ కిట్‌ల లభ్యతను పెంచడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇదీ చూడండి: వణికిస్తున్న మహమ్మారి- లక్ష్యానికి దూరంగా టీకా ప్రక్రియ