EWS reservation criteria review: ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లకు ఉన్న రూ.8 లక్షల ఆదాయ పరిమితిని సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండేను కమిటీ అధిపతిగా నియమించింది. మూడు వారాల్లోగా నివేదిక అందించాలని కమిటీకి సూచించింది.
ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితిపై పునరాలోచిస్తామని కేంద్రం ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్ పరీక్షల విషయంలో సుప్రీంలో నమోదైన కేసుపై విచారణలో భాగంగా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలో నీట్ కౌన్సిలింగ్‌ను వాయిదా వేసింది.
కేంద్రం ప్రతిపాదనను సుప్రీంకోర్టు స్వాగతించింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వర్గీకరణ శాస్త్రీయమైన పద్ధతిలో జరగాలని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఇదీ చదవండి: భారత పౌరసత్వానికి ఆరు లక్షల మంది గుడ్‌బై